త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | ఆ పార్టీల‌కు లేని అభ్యంత‌రాలు తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌పై ఎందుకు..? ఈసీని ప్ర‌శ్నించిన క‌విత‌

Kalvakuntla Kavitha | తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఆ పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత రిప్లై ఇచ్చారు. ఎన్నికల సంఘం ఆమోదించిన అనేక పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లతో రెండు పార్టీలకు గుర్తింపునిచ్చారు. వాటికి లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకు..? అని క‌విత ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jul 12, 2026, 6.11 pm IST

Kalvakuntla Kavitha | ఆ పార్టీల‌కు లేని అభ్యంత‌రాలు తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌పై ఎందుకు..? ఈసీని ప్ర‌శ్నించిన క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఆ పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత రిప్లై ఇచ్చారు. ఎన్నికల సంఘం ఆమోదించిన అనేక పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లతో రెండు పార్టీలకు గుర్తింపునిచ్చారు. వాటికి లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకు..? అని క‌విత ప్ర‌శ్నించారు. మా పార్టీ రిజిస్ట్రేషన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన వెయ్యి అభ్యంతరాలను మాకు పంపండి అని ఆమె కోరారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు రిప్లయ్ ఇచ్చారు. తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి హోదాలో అనిల్ కుమార్ ఆదివారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరును తమకు కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 28న లేఖ ద్వారా సమాచారం ఇచ్చిందని తెలిపారు.

ఆ అభ్యంతరాల్లో ఒక్కటి కూడా తమకు పంపలేదు

కేంద్ర ఎన్నికల కమిషన్ త‌మ‌కు తెలంగాణ రక్షణ సేన పార్టీ కేటాయించడంతో తెలంగాణ వ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించుకోవడంతో పాటు పార్టీ నిర్మాణపరమైన ఇతర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్ 23న తమకు లేఖ రాస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని పేర్కొన్నారని వివరించారు. కానీ ఇంత వరకు ఆ అభ్యంతరాల్లో ఒక్కటి కూడా తమకు పంపలేదని తెలిపారు. అభ్యంతరాలు ఎవరు తెలిపారు.. ఆయా అభ్యంతరాల్లో ఏమి పేర్కొన్నారు అనే వివరాలు కూడా ఇవ్వలేదన్నారు. అసలు అభ్యంరాతలనే తమకు పంపకుంటే తాము సమాధానం ఎలా చెప్పగలమని అన్నారు.

వెయ్యి అభ్యంతరాలు వచ్చాయన్న ఈసీ నిర్ణయం స‌రికాదు

తెలంగాణ రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు అని.. వెయ్యి అభ్యంతరాలు వచ్చాయనే సంఖ్యను చూపిస్తూ ఈసీ నిర్ణయం సరికాదన్నారు. అసలు అభ్యంతరాల వెనుక లీగల్ మెరిట్ ఏంటీ అనేది పరిశీలించాలి? ఎవరైనా కావాలనే గ్రూపులుగా ఏర్పడి, ప్లాన్ ప్రకారం ఇదంతా చేయించారా? అనేది తమకు అబ్జెక్షన్ కాపీలు ఇస్తేనే తెలుస్తుంది. ఈసీ ఆమోదించిన పేరును నమ్ముకొని సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకున్నామని.. ఇప్పుడు ఆ పేరును మార్చుకోవాలని అంటే అది తమకు తీవ్ర నష్టం, అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు.

విడి పదాలను ముక్కలు చేసి లేదా విడదీసి చూడ‌కూడ‌దు

ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టుగా తాము ఈసీ ఎదుట వ్యక్తిగత విచారణ హాజరవాడానికి ముందే తమ పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను ఇవ్వాలని కోరారు. అప్పుడు మాత్రమే తాము సరైన సమాధానం చెప్పుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతిపాదిత "తెలంగాణ రక్షణ సేన" అనే పేరును మేము పూర్తి సదుద్దేశంతో స్వతంత్రంగా ఆలోచించి పెట్టిన పేరు అని వివరించారు. "తెలంగాణ రక్షణ సేన" అనే పేరుతో దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ కూడా నమోదు కాలేదని.. ఇది ఏ గుర్తింపు పొందిన లేదా నమోదైన రాజకీయ పార్టీ పేరును పోలి లేదని అన్నారు. రెండు పార్టీల పేర్ల మధ్య పోలికలను నిర్ధారించుకునేప్పుడు రాజకీయ పార్టీ యొక్క పూర్తి పేరును ఒకే సమగ్ర రూపంగా భావించాలని.. కానీ అందులోని విడి పదాలను ముక్కలు చేసి లేదా విడదీసి చూడకూడదన్నారు.

ప్ర‌స్తుతం ఉనికిలో ఉన్న పార్టీతోనూ త‌మ పార్టీ పేరుకు పోలిక లేదు

ఎన్నికల కమిషన్ తమకు పంపిన అభ్యంతరాల్లోని “తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్) (2024)”, “తెలంగాణ రాజ్య సమితి” (2023) అనేవి వేర్వేరు పేర్లు.. విభిన్న ఉచ్చారణ, నిర్మాణం, గుర్తింపు, నాయకత్వం, సంస్థాగత శైలితో పాటు ప్రజల్లో వేర్వేరు గుర్తింపు కలిగిన రాజకీయ పేర్లు అని వివరించారు. ఆ పేర్లతో "తెలంగాణ రక్షణ సేన" ను దాని సమగ్ర రూపంలో పరిశీలించినప్పుడు, అది పూర్తి భిన్నంగా, స్పష్టంగా గుర్తించదగిన రాజకీయ పార్టీగా తెలుస్తోందన్నారు.. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఏ గుర్తింపు పొందిన లేదా నమోదైన రాజకీయ పార్టీతోనూ తమ పార్టీ పేరుకు పోలిక లేదన్నారు. గతంలో కూడా కేవలం ఒకే రకమైన భౌగోళిక వర్ణనాత్మక, సిద్ధాంతపరమైన పదాలు ఉన్నాయనే కారణంతో పార్టీ రిజిస్ట్రేషన్ నిరాకరించిన దాఖలాలు కూడా లేవని వివరించారు. ఒకే విధమైన పదాలతో సమాంతరంగా వేర్వేరు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు దేశంలో వందల్లో ఉన్నాయని తెలిపారు.

సమాధానం ఇవ్వడానికి తమకు తగినంత సమయం ఇవ్వండి

ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, మక్కల్, ప్రజా సేవ, జన్ అధికార్, రాష్ట్రీయ జనతా, డెమెక్రాటిక్, సోషల్, రిపబ్లిక్ ఇండియా, శిరోమణి లాంటి పేర్లతో వందలాది పార్టీలు రిజిస్ట్రేషన్ పొంది ఉన్నాయన్న విషయం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపునిచ్చిన ఒకే విధమైన పేర్లు ఉన్న పార్టీల జాబితాను లేఖకు జత చేశారు . "తెలంగాణ రక్షణ సేన" పార్టీ పేరుపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలను, అలాగే తమకు వ్యతిరేకంగా ఉపయోగించాలనుకుంటున్న అన్ని ఆధారాలను తమకు అందజేయాలని కోరారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమాధానం ఇవ్వడానికి తమకు తగినంత సమయం ఇచ్చాకే... వ్యక్తిగత విచారణకు పిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆ వివరాల వెల్లడి తర్వాత తమ వాదనలను సమర్థవంతంగా వినిపించడానికి, అభ్యంతరాలకు సరైన సమాధానం ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కేవలం సాధారణ భౌగోళిక వర్ణానాత్మక ఉనికిని బట్టి, ఊహాజనిత సంక్షిప్త రూపాల (Abbreviations) ఆధారంగా వచ్చిన అభ్యంతరాలన్నింటినీ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. చట్టప్రకారం నిష్పాక్షికమైన, హేతుబద్ధమైన పూర్తి కారణాలతో కూడిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్ర‌జాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A కింద ప్రతిపాదిత "తెలంగాణ రక్షణ సేన" పార్టీ గుర్తింపు కోసం తాము చేసుకున్న దరకదస్తును పరిశీలించి, ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement