Samantha | వంద కోట్ల క్లబ్‌లో మా ఇంటి బంగారం – చరిత్రను తిరగరాసిన సమంత
సమంత మా ఇంటి బంగారం మూవీ వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ఘనతను సాధించిన తొలి తెలుగు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా చరిత్రను సృష్టించింది. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Jul 12, 2026, 6.13 pm IST
Samantha | సమంత మా ఇంటి బంగారం మూవీ సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. వంద కోట్ల వసూళ్లను సాధించిన తొలి తెలుగు లేడీ ఓరియెంటెడ్ మూవీగా చరిత్రను సృష్టించింది. ఈ రికార్డు గురించి చెబుతూ ఓ స్పెషల్ వీడియోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఐప్యాడ్‌లో వంద కోట్లతో కూడిన మా ఇంటి బంగారం పోస్టర్‌ను అభిమానులకు చూపిస్తూ సమంత ఆనందంగా కనిపించింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
సంఖ్య మాత్రమే కాదు...
వంద కోట్లు అన్నది సంఖ్య మాత్రమే కాదు అంటూ పోస్టర్‌ను ఉద్దేశించి సమంత పేర్కొన్నది భాషతో సంబంధం లేకుండా మహిళా ప్రధాన సినిమాలను ఆడియెన్స్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని మరోసారి ఈ మూవీతో నిరూపితమైందని అన్నది.
ఓవర్‌సీస్‌లో...
అరుంధతి, మహానటితో పాటు తెలుగు లో ఇప్పటివరకు వచ్చిన ఫిమేల్ సెంట్రిక్ సినిమాలన్నింటి కలెక్షన్స్‌ను మా ఇంటి బంగారం దాటేసింది. ఓవర్‌సీస్‌లో 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. తెలుగులో నంబర్ వన్ ప్లేస్‌లోనిలిచిన ఈ సినిమా ఇండియా వైడ్‌గా వచ్చిన మహిళా ప్రధాన సినిమాల్లో కలెక్షన్స్ పరంగా ఆరో ప్లేస్‌ను సొంతం చేసుకుంది. మేకర్స్ పెట్టిన బడ్జెట్‌పై 300 శాతానికిపైగా రికవరీ సాధించడం గమనార్హం. 33 కోట్లకుపైనే సమంత, రాజ్ నిడిమోరులకు ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
మూడేళ్ల తర్వాత....
రిలీజ్‌కు ముందు మా ఇంటి బంగారంపై ఎలాంటి అంచనాలు లేవు. మూడేళ్ల తర్వాత సమంత హీరోయిన్‌గా నటించిన మూవీ కావడం, ఆమె మినహా తెలిసిన స్టార్లు ఎవరూ లేకపోవడంతో ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. థియేటర్లలో కనీసం వారం రోజులు ఆడటం కష్టమేనంటూ విమర్శలు వచ్చాయి. ట్రోల్స్‌తో పట్టించుకోకుండా సమంత అండ్ టీమ్ పడిన కష్టానికి వంద కోట్ల రూపంలో పెద్ద ప్రతిఫలమే దక్కింది.
శ్రీముఖి...దిగంత్...
మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో ఆనంద్, శ్రీముఖి, దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. రాజ్ నిడిమోరుతో కలిసి వసంత్ మరిగంటి కథను అందించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. నక్సలైట్‌గా పనిచేసిన ఓ యువతి తన గతాన్ని దాచిపెట్టి గొప్పింటిలోకి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? పెద్ద ఆపద నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది. సమంత యాక్టింగ్, ఆమెపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలకు ప్రశంసలు వస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | రణబాలి అప్డేట్ లీక్ చేసిన రష్మిక – ఇన్‌స్టా పోస్ట్ వైరల్
జులై 12, 2026

S. Janaki | జానకి తొలి సినిమా రిలీజ్ కాలేదు – తెలుగులో ఆమె పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ఇవే
జులై 11, 2026

S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత – అరవై ఏళ్ల సినీ ప్రయాణం – యాభై వేల పాటలు
జులై 11, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | రణబాలి అప్డేట్ లీక్ చేసిన రష్మిక - ఇన్‌స్టా పోస్ట్ వైరల్
- ●Ramchandar Rao | రేవంత్.. నువ్ ఎక్కినప్పటి నుంచి లెక్కగట్టి ఇవ్వు
- ●Addanki Dayaker | నీటి దొంగలు నీతులు చెప్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై అద్దంకి దయాకర్ ఫైర్
- ●Pakistani Woman Arrested Karnataka | కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్.. దేశం పేరు దాచిపెట్టి ఓటర్, రేషన్ కార్డులు
- ●Tummala Nageshwar Rao | ఎల్ నినో ఎఫెక్ట్.. 13న ఇక్రిశాట్లో మంత్రి తుమ్మల సమీక్ష
- ●Kalvakuntla Kavitha | ఆ పార్టీలకు లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకు..? ఈసీని ప్రశ్నించిన కవిత

Rashmika Mandanna | రణబాలి అప్డేట్ లీక్ చేసిన రష్మిక - ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Ramchandar Rao | రేవంత్.. నువ్ ఎక్కినప్పటి నుంచి లెక్కగట్టి ఇవ్వు

Addanki Dayaker | నీటి దొంగలు నీతులు చెప్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై అద్దంకి దయాకర్ ఫైర్

Pakistani Woman Arrested Karnataka | కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్.. దేశం పేరు దాచిపెట్టి ఓటర్, రేషన్ కార్డులు



