Tummala Nageshwar Rao | ఎల్ నినో ఎఫెక్ట్.. 13న ఇక్రిశాట్‌లో మంత్రి తుమ్మల సమీక్ష
Tummala Nageshwar Rao | వానాకాలం 2026లో ఎల్ నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయం, ఇక్రిశాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, సిఆర్ఐడిఏ శాస్త్రవేత్తలు, ఐఎండి అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, భూగర్భ జల విభాగం అధికారులతో ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ఇక్రిశాట్‌లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
Tummala Nageshwar Rao | త్రినేత్ర.న్యూస్ : వానాకాలం 2026లో ఎల్ నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయం, ఇక్రిశాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, సిఆర్ఐడిఏ శాస్త్రవేత్తలు, ఐఎండి అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, భూగర్భ జల విభాగం అధికారులతో ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ఇక్రిశాట్‌లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, భారత వాతావరణ శాఖ (IMD), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ICAR-CRIDA శాస్త్రవేత్తలతో ఇప్పటికే సమన్వయం చేసుకుంటూ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దాని ప్రకారంమూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళిక , జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేయగా జూలై 15 నుండి అమలు చేయాల్సిన ప్రణాళికపై మరోమారు అధికారులు శాస్త్రవేత్తలతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
గత ఖరీఫ్‌లో 1.40 కోట్ల ఎకరాలలో వివిధ పంటలు సాగవ్వగా.. అందులో 70 లక్షలు వరి సాగు అయినట్టు తెలిపారు. ఈ వానాకాలం ఎల్-నినో పరిస్థితులు ఉన్నప్పటికి ఇప్పటికే 60 లక్షల ఎకరాలలో వివిధ పంటలు వేసినట్టు వివరించారు. అయితే ఎల్‌నినో ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ సీజన్లో వరి పంట 30-40లక్షల ఎకరాలలో సాగు అయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నామని అన్నారు. అందుకనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాలకు 3 దశలలో ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
ఎల్-నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం, మధ్యలో విరామాలు ఏర్పడటం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ఆధారంగా చేసుకుని మూడు దశల్లో రాష్ట్రవ్యాప్త కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక Contingency Plans సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.
వర్షపాతం పరిస్థితులపై రోజువారీ సమీక్ష... 20 జిల్లాలపై ప్రత్యేక దృష్టి
జూలై 10 నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాల వర్షపాతం పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 20 జిల్లాల్లో వర్షపాతం లోటు నమోదైందన్నారు. లోటు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో వర్షపాతం, సాగు పురోగతి, నేల తేమ, విత్తనాల లభ్యత, రైతుల అవసరాలపై రోజువారీ నివేదికలను విశ్లేషిస్తూ, అవసరమైన చోట వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు.
సంబంధిత వార్తలు

MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్
జులై 12, 2026

Addanki Dayaker | నీటి దొంగలు నీతులు చెప్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై అద్దంకి దయాకర్ ఫైర్
జులై 12, 2026

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
జులై 12, 2026
తాజావార్తలు
- ●MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్
- ●Union Minister | కేంద్రమంత్రి సోషల్ మీడియా ఆఫీసులో.. లొంగదీసుకొని ఆత్యాచారం
- ●Rashmika Mandanna | రణబాలి అప్డేట్ లీక్ చేసిన రష్మిక - ఇన్‌స్టా పోస్ట్ వైరల్
- ●Ramchandar Rao | రేవంత్.. నువ్ ఎక్కినప్పటి నుంచి లెక్కగట్టి ఇవ్వు
- ●Addanki Dayaker | నీటి దొంగలు నీతులు చెప్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై అద్దంకి దయాకర్ ఫైర్
- ●Pakistani Woman Arrested Karnataka | కర్ణాటకలో పాక్ మహిళ అరెస్ట్.. దేశం పేరు దాచిపెట్టి ఓటర్, రేషన్ కార్డులు

MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్

Union Minister | కేంద్రమంత్రి సోషల్ మీడియా ఆఫీసులో.. లొంగదీసుకొని ఆత్యాచారం

Rashmika Mandanna | రణబాలి అప్డేట్ లీక్ చేసిన రష్మిక - ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Ramchandar Rao | రేవంత్.. నువ్ ఎక్కినప్పటి నుంచి లెక్కగట్టి ఇవ్వు



