Monalisa Bhosle | “మీరు కేరళలో ఉండటం మీ అదృష్టం”: కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
కుంభమేళా వీడియోలతో ఫేమస్ అయిన మోనాలిసా భోస్లే మతాంతర వివాహం తీవ్ర దుమారం రేపుతోంది. తమకు ప్రాణహాని ఉందన్న జంటపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
Monalisa Bhosle | త్రినేత్ర.న్యూస్ : 2025 కుంభమేళాలో (Kumbh Mela) పూసల దండలు అమ్ముతూ రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోస్లే (Monalisa Bhosle) మతాంతర వివాహం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పెద్ద లీగల్, పొలిటికల్ ఇష్యూగా మారింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమె, తన భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్‌తో కలిసి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ (Anticipatory bail) పిటిషన్‌పై కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కోర్టు హాల్‌లో ఆసక్తికర వాదనలు
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఈ జంటకు బెదిరింపులు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. "మీరు కేరళలో ఉండటం మీ అదృష్టం" అని జడ్జి కామెంట్ చేశారు. దీనికి ఈ జంట తరపు లాయర్ స్పందిస్తూ.. "అవును.. మేం ఇప్పుడు ప్రాణాలతో ఉండటానికి ఆ ఒక్కటే కారణం" అని బదులివ్వడం కోర్టు హాల్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.
బుధవారం ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును వెలువరించనుంది.
పెళ్లి చట్టబద్ధమా? మోనాలిసా మైనరా?
సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మోనాలిసా.. ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి నాటికి ఆమెకు వయసు నిండలేదన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ వివాహం పెద్ద దుమారంగా మారింది.
మోనాలిసాకు అప్పటికే మైనారిటీ తీరిపోయిందని, కానీ ఫండమెంటలిస్ట్ గ్రూపులు, మధ్యప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్‌లోని కొందరు కావాలనే ఆమెను మైనర్‌గా చూపేందుకు రికార్డులను మార్చేశారని జంట తరఫు లాయర్ ఎం. శశింద్రన్ వాదించారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏమంటోంది?
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి.రాజు వాదనలు వినిపిస్తూ ఈ బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. వరుడు ముస్లిం అయినప్పటికీ, హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరగడం వల్ల చట్టపరంగా ఈ పెళ్లి చెల్లదని ఆయన వాదించారు.
అంతేకాకుండా, మోనాలిసా అసలు పుట్టిన తేదీ డిసెంబర్ 2009 అని, పెళ్లి నాటికి ఆమె మైనర్ కావడంతో చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాల కింద కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. తప్పుడు జనన, వివాహ ధ్రువీకరణ పత్రాలు సృష్టించినందుకు ఫర్మాన్ ఖాన్‌పై ఫోర్జరీ కిడ్నాపింగ్ కేసులు కూడా నమోదు చేయవచ్చని కోర్టుకు తెలిపారు.
అయితే, ఈ కేసులో బాధితురాలిగా చెబుతున్న మోనాలిసా స్వయంగా తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం.
రాజకీయ దుమారం.. కేరళ టు ఎంపీ
ఈ కేసు కేవలం మోనాలిసా వైరల్ ఇమేజ్ వల్లే కాకుండా.. కేరళ, మధ్యప్రదేశ్ కోర్టుల్లో ఒకేసారి విచారణ జరుగుతుండటంతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పెళ్లికి సహకరించారనే ఆరోపణలపై ఎం.వి.గోవిందన్, వి.శివన్‌కుట్టి, ఏ.ఏ.రహీమ్ సహా పలువురు సీపీఎం నేతలపై ఫర్మాన్ ఖాన్‌తో పాటు కేసు నమోదు చేయాలని తిరువనంతపురంలోని పోక్సో (POCSO) కోర్టులో ఓ ప్రైవేట్ ఫిర్యాదు కూడా దాఖలైంది.
వ్యక్తిగత స్వేచ్ఛ, మతాంతర వివాహం, వయసు నిర్ధారణ, క్రిమినల్ కేసులు లాంటి అనేక అంశాలు ముడిపడి ఉన్న ఈ హై-ప్రొఫైల్ కేసులో కేరళ హైకోర్టు బుధవారం ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
ఆగస్టు 6, 2026

Kerala Story 2 | కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు లైన్ క్లియర్ – స్టే ఎత్తేసిన కోర్టు
ఫిబ్రవరి 27, 2026

kerala story 2 | కేరళ స్టోరీ 2 రిలీజ్‌పై స్టే విధించిన కోర్టు – సీబీఎఫ్‌సీకి షాక్
ఫిబ్రవరి 26, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



