త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | అమెరికా టూర్ కేన్సిల్.. సీఎం రేవంత్ విదేశీ పర్యటన కుదింపు

G

Telangana | Published On Aug 20, 2026, 12.26 pm IST

Revanth Reddy | అమెరికా టూర్ కేన్సిల్.. సీఎం రేవంత్ విదేశీ పర్యటన కుదింపు
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) త‌న‌ విదేశీ ప‌ర్య‌ట‌న‌ను కుదించుకున్నారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకోవ‌డంతో ఈ నెల 23తో ముఖ్య‌మంత్రి ఫారెన్ టూర్ (CM Revant Foreign Tour) ముగియ‌నుంది. షెడ్యూల్ ప్ర‌కారం ఆగ‌స్టు 20 నుంచి 30 వ‌ర‌కు సీఎం రేవంత్ ప‌ది రోజుల పాటు అమెరికా (America), బ్రిటన్ (Britain) దేశాలలో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌వ‌డంతో కేవ‌లం లండ‌న్‌కే ప‌రిమితం కానుంది.

ఆగ‌స్టు 20న అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి లండ‌న్‌కు సీఎం రేవంత్ బ‌య‌లుదేరుతారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అనంత‌రం ఆగ‌స్టు 23న హైద‌రాబాద్‌కు తిరుగు ప‌య‌నం అవుతారు. షెడ్యూల్ ప్ర‌కారం బోస్ట‌న్‌, న్యూయార్క్‌లో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే వాటిని సీఎం రేవంత్ ర‌ద్దు చేసుకున్నారు.

సీఎం షెడ్యూల్ ఇలా..

  • ఆగ‌స్టు 20న- రాత్రి 12.30 గంట‌ల‌కు లండ‌న్ బ‌య‌ల్దేరుతారు..
  • ఆగస్టు 21న- లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలోని (Oxford University) బ్లావట్నిక్‌ స్కూల్‌ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శిస్తారు. అక్కడి ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారు.
  • ఆగస్టు 22న- లండన్‌లో కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం సమావేశం కానున్నారు. అదేరోజు ఉదయం 11.30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్‌కి వెళ్తారు.
  • ఆగస్టు 23న- లండన్ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకుంటారు.
Advertisement
Advertisement