Amit Thackeray | మరాఠీ మాట్లాడకుంటే కొడతాం.. ట్యాక్సీ డ్రైవర్లకు అమిత్ థాక్రే హెచ్చరిక
Amit Thackeray | ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ, కేవలం హిందీ (Hindi)లోనే మాట్లాడాలని పట్టుబట్టే ఆటో-రిక్షా, టాక్సీ డ్రైవర్లపై తాము భౌతిక దాడి చేస్తామంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు అమిత్ థాక్రే (Amit Thackeray) బహిరంగంగా హెచ్చరించారు.
Amit Thackeray | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలో మరాఠీ (Marathi) భాషా వివాదంపై రాజ్ థాక్రే కుమారుడి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు అమిత్ థాక్రే (Amit Thackeray) తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ, కేవలం హిందీ (Hindi)లోనే మాట్లాడాలని పట్టుబట్టే ఆటో-రిక్షా, టాక్సీ డ్రైవర్లపై (auto rickshaw and taxi drivers) తాము భౌతిక దాడి చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించారు.
"ఆటో డ్రైవర్లు హిందీలో మాట్లాడటం లేదా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు. ప్రజలను ఇబ్బంది పెడితే దెబ్బలు పడతాయి. యూపీ భాష మాట్లాడాలని, హిందీ మాట్లాడాలని ప్రజలపై ఒత్తిడి వద్దు. మేము మరాఠీలోనే మాట్లాడతాం" అని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఆటో-రిక్షా, టాక్సీ డ్రైవర్లు మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమిత్ తీవ్రంగా తప్పుబ్టటారు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రాజకీయ ప్రయోజనాల కోసం మరాఠీ భాషను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గుజరాత్, పంజాబ్, దక్షిణాది రాష్ట్రాల్లో వారి స్థానిక భాషలపై మక్కువ ఉన్నట్లే మహారాష్ట్రలో మరాఠీని గౌరవించాల్సిందేనని అమిత్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు కచ్చితంగా స్థానిక భాష మరాఠీలో మాట్లాడాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 12 నుంచి మహారాష్ట్ర మోటార్ వాహనాల సవరణ రూల్స్ ప్రకారం కమర్షియల్ డ్రైవర్లకు మరాఠీ మాట్లాడటం తప్పనిసరి చేసింది. రవాణా శాఖ నిర్వహించిన పరీక్షల్లో విఫలమైన వందలాది మంది నాన్-మరాఠీ డ్రైవర్లకు గతంలో నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే డ్రైవర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రాథమిక మరాఠీ నేర్చుకోవడానికి ప్రభుత్వం ఏడాది సమయం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు క్యాబ్ డ్రైవర్లు బాంబే హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నిబంధన తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వివాదాల వేళ అమిత్ థాక్రే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read..
టిబెట్‌లో డ్యామ్ లీకేజీ.. నేపాల్‌లో మళ్లీ వరద హెచ్చరికలు.. బీహార్ గ్రామాల్లో హైఅలర్ట్
అమెరికా-కెనడా ట్రేడ్ వార్.. సరస్సు పేరు మార్చిన ట్రంప్
వరద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ వీడియో
తాజావార్తలు
- ●Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె
- ●Apple iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..
- ●Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
- ●MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..

Power problem in Konda Reddy Pally | కరెంటే లేని పల్లె.. కొండారెడ్డి పల్లె

Apple iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ సిరీస్ వచ్చేసింది.. ధర రూ.1.64 లక్షల నుంచి..

Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్





