Tamil Nadu | తమిళనాడులో హిందీకి స్థానం లేదు : డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu | త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు మరోసారి భాషా వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తమిళనాట హిందీకి స్థానం లేదని ఆ డీకేఎం నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
Tamil Nadu | త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు మరోసారి భాషా వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తమిళనాట హిందీకి స్థానం లేదని ఆ డీకేఎం నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీ రుద్దే ప్రయత్నాలను వ్యతిరేకించడం కొత్త విషయం కాదని, చారిత్రక ఉద్యమాలు కూడా జరిగాయన్నారు. 1937-38లో పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త పెరియార్ తొలిసారి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారని ఉదయనిధి గుర్తు చేశారు. అప్పటి నిరసనల్లో మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి 14 ఏళ్ల వయసులో తిరువారూరులో పాల్గొన్నారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 1940 ఫిబ్రవరి 21న ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, హిందీ తప్పనిసరి బోధనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
ఇతర రాష్ట్రాలు హిందీని తప్పనిసరి చేసిన సమయంలో.. తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుందని పలువురు ప్రశ్నిస్తారన్నారు. తమిళ భాష ప్రాచీరమైందని, సంపన్నమైందన్న ఆయన.. అందుకే ఇతర భాషలపై ఆధారపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ద్రవిడ ఉద్యమం పాత్రను ప్రస్తావించారు. రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని కొనసాగించిన పార్టీ డీఎంకే అని, హిందీకి రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి “తమిళనాడు” అనే పేరు రావడంలోనూ, తమిళానికి “శాస్త్రీయ భాష” హోదా పొందడంలోనూ డీఎంకే కీలక పాత్ర పోషించిందని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో భాషా రాజకీయాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల నేపథ్యంలో ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హిందీ వ్యతిరేక భావజాలం, ప్రాంతీయ గుర్తింపు అంశాలు తమిళనాట రాజకీయంగా కీలకంగా మారాయి.
తాజావార్తలు
- ●Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం
- ●Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
- ●PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్
- ●Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..
- ●Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ
- ●Minister Vivek | మియోషి మేయర్‌తో మంత్రి వివేక్ భేటీ

Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం

Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్

Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..






