Aishwarya Rajesh | హిట్ తర్వాత మరో బంపరాఫర్.. రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేశ్
Aishwarya Rajesh | సంక్రాంతి సెంటిమెంట్‌ను మరోసారి కొనసాగించేందుకు ఐశ్వర్య రాజేశ్ సిద్ధమవుతోంది. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో 2025 సంక్రాంతి బరిలో ఘన విజయాన్ని అందుకున్న ఆమె.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Entertainment | Published On Aug 28, 2026, 1.25 pm IST
Aishwarya Rajesh | సంక్రాంతి సెంటిమెంట్‌ను మరోసారి కొనసాగించేందుకు ఐశ్వర్య రాజేశ్ సిద్ధమవుతోంది. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో 2025 సంక్రాంతి బరిలో ఘన విజయాన్ని అందుకున్న ఆమె.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఐశ్వర్య కెరీర్‌లో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలవనుంది. రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ సక్సెస్ అందుకున్నాడు. చాలాకాలం తర్వాత ఆయనకు మంచి విజయాన్ని అందించిన ఈ చిత్రం దూసుకుపోతున్నది. ఈ జోష్‌లోనే కొత్త చిత్రాన్ని కూడా వేగంగా ప్రారంభించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న తర్వాత ఆమెకు పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దీంతో రవితేజ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం ఆమెకు కీలకంగా మారింది. కథకు, తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్ట్‌ను ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాజేశ్ ఇప్పటివరకు చేసిన పాత్రలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నది. కేవలం గ్లామర్ కోణానికే పరిమితం కాకుండా కథకు అవసరమైన పాత్రల్లో తనదైన నటనను చూపించడం ఆమె ప్రత్యేకత. ఈ నేపథ్యంలో హసిత్ గోలి రూపొందిస్తున్న సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. రవితేజతో ఆమె కెమిస్ట్రీ తెరపై ఎలా పండుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో నటుడు శ్రీవిష్ణు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
రవితేజ, ఐశ్వర్య రాజేశ్‌లతో పాటు శ్రీవిష్ణు ఉండడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు పాత్రకు కథలో ఎలాంటి ప్రాధాన్యం ఉందనేది ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్న నిర్మాతలు.. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దాదాపు నాలుగున్నర నెలల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసి 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో టీమ్ ఉన్నది. 2025లో ‘సంక్రాంతికి వస్తున్నాం’తో పండగ సీజన్‌లో విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రాజేశ్‌కు.. ఇప్పుడు మరో సంక్రాంతి సినిమా దక్కడం విశేషం. పైగా ఈసారి రవితేజ వంటి మాస్ హీరోతో జోడీ కడుతుండడంతో ఈ చిత్రం ఆమె కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారుతుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ‘ఇరుముడి’తో ఊపుమీదున్న రవితేజకు, మరో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఐశ్వర్య రాజేశ్‌కు ఈ సినిమా ఏ స్థాయి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
సెప్టెంబర్ 4, 2026

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 4, 2026

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
- ●Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజయ్ - రామ్‌చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు - ఫొటోలపై ఓ లుక్కేయండి...
- ●Congress Party | కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్

Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజయ్ - రామ్‌చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు - ఫొటోలపై ఓ లుక్కేయండి...

Congress Party | కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి



