త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nepal Police | టిబెట్‌లో డ్యామ్ లీకేజీ.. నేపాల్‌లో మ‌ళ్లీ వ‌ర‌ద హెచ్చ‌రిక‌లు.. బీహార్ గ్రామాల్లో హైఅల‌ర్ట్‌

Nepal Police | ఆక‌స్మిక వ‌ర‌ద‌లో అతలాకుత‌ల‌మైన నేపాల్‌లో మ‌రోసారి వ‌ర‌ద హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. టిబెట్‌లో డ్యామ్ లీకేజీ అయ్యిందని ఏ క్ష‌ణ‌మైనా వర‌ద ముంచుకొచ్చే ప్ర‌మాదం ఉంద‌ని నేపాల్ పోలీసులు (Nepal Police) హెచ్చ‌రించారు. ముంచుకొస్తున్న ముప్పు మొన్న‌టి కంటే ఐదు రెట్లు తీవ్రంగా ఉంటుంద‌ని చెప్పారు.

D

National | Published On Aug 28, 2026, 12.52 pm IST

Nepal Police | టిబెట్‌లో డ్యామ్ లీకేజీ.. నేపాల్‌లో మ‌ళ్లీ వ‌ర‌ద హెచ్చ‌రిక‌లు.. బీహార్ గ్రామాల్లో హైఅల‌ర్ట్‌
Advertisement

Nepal Police | త్రినేత్ర‌.న్యూస్ : నేపాల్‌లో మ‌రోసారి వ‌ర‌ద హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. టిబెట్‌లో డ్యామ్ లీకేజీ (dammed lake in Tibet overflows) అయ్యిందని ఏ క్ష‌ణ‌మైనా వర‌ద ముంచుకొచ్చే ప్ర‌మాదం ఉంద‌ని నేపాల్ పోలీసులు (Nepal Police) హెచ్చ‌రించారు. ఈ మేర‌కు రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో ఉన్న పోలీసులు, స‌హాయ‌క సిబ్బంది, స్థానికులు సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాల‌ని ఆదేశించారు.

టిబెట్ (Tibet) వైపు స‌ర‌స్సు ఏ క్ష‌ణ‌మైనా బ‌ద్ద‌లై వ‌ర‌ద ప్ర‌వాహం దిగువ ప్రాంతాల‌ను ముంచెత్తే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. మొన్న సంభ‌వించిన ఆక‌స్మిక వ‌ర‌దల‌ కంటే ముంచుకొస్తున్న ముప్పు ఐదు రెట్లు తీవ్రంగా ఉంటుంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ప్ర‌భావిత ప్రాంతాల్లో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. పోలీసుల అల‌ర్ట్‌తో స్థానిక యంత్రాంగం, ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని సుర‌క్షిత ప్రాంతాల‌కు ప‌రుగులు తీస్తున్నారు.

రెస్క్యూ ఆప‌రేష‌న్స్ నిలిపివేత‌

తీవ్ర‌మైన వ‌ర‌ద ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో నేపాల్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు నిలిపివేసింది. రెస్క్యూటీమ్స్‌, అధికార యంత్రాంగం, వాహ‌నాల‌ను డ్యామేజ్ సైట్స్ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తోంది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తోంది. మ‌రోవైపు రెండోసారి వ‌ర‌ద ముప్పు ముంచుకొస్తున్న నేప‌థ్యంలో టిబెట్ వైపు చైనా సైతం స‌హాయ‌క చ‌ర్య‌లను నిలిపివేసింది.

మాకు ఎవ‌రి సాయం అవ‌స‌రం లేదు..

ఇదిలా ఉండ‌గా.. జ‌ల ప్ర‌ళ‌యంతో అత‌లాకుత‌ల‌మైన హిమాల‌య దేశానికి ప్ర‌పంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తుండ‌గా.. నేపాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని తిర‌స్క‌రించింది. త‌మ‌కు ఎటువంటి స‌హాయం అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

బీహార్ గ్రామాల్లో హై అల‌ర్ట్‌

నేపాల్ వ‌ర‌ద హెచ్చ‌రిక‌ల‌తో భార‌త్‌లోని బీహార్ స‌రిహ‌ద్దు గ్రామాల్లో అధికారులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. గండకీ నది బ్యారేజ్‌కు వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్యారేజ్‌లో నీటి మ‌ట్టాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తనిఖీ చేస్తున్నారు. వ‌ర‌ద ముప్పు నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా స‌రిహ‌ద్దు గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. మ‌రోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చైనాలో భూకంపం

ఆక‌స్మిక వ‌ర‌ద‌ల వేళ చైనాలో భారీ భూకంపం సంభ‌వించింది. శుక్రవారం ఉదయం సిచువాన్ ప్రావిన్సులోని లాంగ్‌చాంగ్ సిటీలో భూమి కంపించింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 5.1గా న‌మోదైంది. లాంగ్‌చాంగ్ సిటీలో భూమికి 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్ప‌టికే ఆక‌స్మిక వ‌ర‌ద‌ల భ‌యంతో వ‌ణికిపోతున్న అక్క‌డి ప్ర‌జ‌లు.. తాజా భూకంపంతో ఉలిక్కిప‌డ్డారు.

Also Read..

వ‌ర‌ద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. ప‌రుగులు తీసిన జ‌నం.. షాకింగ్ వీడియో

గ్రాండ్ చెస్ టూర్‌లో చ‌రిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత

అమెరికా-కెన‌డా ట్రేడ్ వార్‌.. సరస్సు పేరు మార్చిన ట్రంప్

Advertisement
Advertisement