Rashmika Mandanna | బయోపిక్‌లో నేషనల్ క్రష్ – విజయ్ దేవరకొండకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో రష్మిక సినిమా!
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై మరో కొత్త రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ బయోపిక్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాన్ ఇండియన్ మూవీకి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నాడు.
Entertainment | Published On Aug 28, 2026, 1.15 pm IST
Rashmika Mandanna | లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథతో తెలుగులో ఓ సినిమా రాబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీవాస్ ఈ పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్నారు. బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. టెక్నీషియన్లు ఫిక్స్ అయ్యారు. ఎప్పుడంటే అప్పుడే షూటింగ్ మొదలుపెట్టడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. కానీ సుబ్బులక్ష్మి పాత్రలో నటించే హీరోయిన్ దగ్గరే మేకర్స్ కొద్ది నెలలుగా తర్జనభర్జనలు పడుతున్నారు. తొలుత ఈ బయోపిక్‌లో హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు వినిపించింది. కానీ రామాయణతో పాటు రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఈ బయోపిక్‌ను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత రుక్మిణి వసంత్ పేరు తెరపైకి వచ్చింది. చివరకు రూమర్‌గానే మిగిలిపోయింది.
టైటిల్ రోల్...
తాజాగా ఈ బయోపిక్‌లో రష్మిక మందన్న టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే రష్మికను కలిసి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎంఎస్ సుబ్బులక్ష్మి కథను వినిపించినట్లు సమాచారం. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో రష్మికకు ఉన్న క్రేజ్ ఈ బయోపిక్‌కు ప్లస్సవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. కథ విన్న రష్మిక తన నిర్ణయాన్ని మాత్రం చెప్పలేదని అంటున్నారు.
కింగ్డమ్ డిజాస్టర్...
గౌతమ్ తిన్ననూరి గత సినిమా కింగ్డమ్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. అన్నదమ్ముల అనుబంధంతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కింగ్డమ్‌కు పార్ట్ 2ను కూడా అనౌన్స్‌చేశారు. తొలి భాగమే నష్టాలను తెచ్చిపెట్టడంతో సీక్వెల్‌ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ పక్కనపెట్టారు. కింగ్డమ్‌తో తనకు గౌతమ్ తిన్ననూరి హిట్టు ఇస్తాడని విజయ్ దేవరకొండ చాలా నమ్మాడు. కానీ ఆ నమ్మకాన్ని గౌతమ్ తిన్ననూరి నిలబెట్టుకోలేకపోయాడు. కింగ్డమ్ రిజల్డ్ దృష్ట్యా ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌కు రష్మిక మందన్న గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
సెప్టెంబర్ 4, 2026

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ – విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 4, 2026

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



