త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prisha Singh | సక్సెస్‌ కోసం ప్రిషా మరో ప్రయత్నం.. ఈసారైనా ఫలిస్తుందా?

Prisha Singh | టాలీవుడ్‌లో కొత్తతరం కథానాయికగా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న నటి ప్రిషా సింగ్‌. తొలి చిత్రాలు భారీ విజయాలు సాధించకపోయినా.. అందం, స్క్రీన్‌ ప్రెజెన్స్‌, సహజ నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నిఖిల్‌ సిద్ధార్థ్‌ నటించిన ‘స్పై’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత అల్లు శిరీష్‌ ‘బడ్డీ’లో ఎయిర్‌ హోస్టెస్‌గా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ ముంబయి భామ.. గ్లామర్‌తో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలపై దృష్టి సారించింది.

P

Entertainment | Published On Aug 28, 2026, 1.35 pm IST

Prisha Singh | సక్సెస్‌ కోసం ప్రిషా మరో ప్రయత్నం.. ఈసారైనా ఫలిస్తుందా?
Advertisement

Prisha Singh | టాలీవుడ్‌లో కొత్తతరం కథానాయికగా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న నటి ప్రిషా సింగ్‌. తొలి చిత్రాలు భారీ విజయాలు సాధించకపోయినా.. అందం, స్క్రీన్‌ ప్రెజెన్స్‌, సహజ నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. నిఖిల్‌ సిద్ధార్థ్‌ నటించిన ‘స్పై’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత అల్లు శిరీష్‌ ‘బడ్డీ’లో ఎయిర్‌ హోస్టెస్‌గా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ ముంబయి భామ.. గ్లామర్‌తో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలపై దృష్టి సారించింది. సినిమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రిషాకు మంచి ఆదరణ ఉంది. చీరకట్టులో సంప్రదాయ లుక్‌ నుంచి వెస్ట్రన్‌ ఫ్యాషన్‌ వరకు విభిన్నంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

తాజాగా ఆమె పంచుకున్న ఫొటోషూట్‌ చిత్రాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. భాషతో సంబంధం లేకుండా భావోద్వేగమే సినిమాకు ప్రధానమని భావించే ప్రిషా.. మంచి కథ, బలమైన పాత్ర లభిస్తే తెలుగు సహా ఇతర భాషల్లోనూ నటించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంలో టైటిల్‌ పాత్రలో ప్రిషా సింగ్‌ నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో తాను తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఆలోచించిందేనని ఆమె చెబుతోంది. సినిమాల మధ్య గ్యాప్‌ రావడం కూడా తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకునే తీసుకున్న నిర్ణయమని తెలిపింది.

‘హాస్య మూవీస్‌’ సంస్థ, దర్శకుడిని కలిసిన తర్వాత సుమారు రెండు మూడు నెలల పాటు సాగిన ప్రీ-ప్రొడక్షన్‌ ప్రక్రియలో కథను అర్థం చేసుకున్నానని.. ముగ్గురు మహిళా పాత్రల్లో ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం తనను ఎంపిక చేశారని వెల్లడించింది. ఈ చిత్రంలో అల్లరి నరేశ్‌తో కలిసి పనిచేయడం తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని ప్రిషా చెప్పింది. ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్‌ అయినప్పటికీ.. సెట్స్‌లో ఆయన ఎప్పుడూ తన సీనియారిటీని చూపించలేదని పేర్కొంది. ఒక కొత్త నటుడిలా నిశ్శబ్దంగా, వినయంగా తన వంతు షాట్‌ కోసం ఎదురుచూసేవారని ప్రశంసించింది. కెమెరా ముందుకు రాగానే పాత్రలోకి వెళ్లి.. ‘కట్‌’ చెప్పగానే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేయడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపింది. ఆయన నుంచి నటనతో పాటు సెట్స్‌లో ఉండే తీరును కూడా నేర్చుకున్నానని చెప్పింది. అల్లరి నరేశ్‌ సినిమాల్లో తనకు ‘నాంది’ ఎంతో ఇష్టమని ప్రిషా వెల్లడించింది.

కెమెరా ముందు ఆయన కామెడీ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించినా.. కెమెరా వెనుక మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పింది. ప్రస్తుతం ‘రంభ ఊర్వశి మేనక’పై ఆశలు పెట్టుకున్నది ప్రిషా. చాలాకాలం గ్యాప్‌ తర్వాత నటిస్తున్న ఈ మూవీ తన సినీ ప్రయాణంలో మరో కీలక అడుగుగా నిలుస్తుందని భావిస్తోంది. సినిమా స్టోరీ విషయానికి స్వర్గలోకానికి చెందిన రంభ, ఊర్వశి, మేనకలను భూమిపైకి రప్పించేందుకు ఓ వ్యక్తి 15 ఏళ్లుగా ఓ మాయా గ్రంథంతో ప్రయత్నిస్తుంటాడు. అయితే, వారు భూమిపైకి దిగకుండా దేవేంద్రుడు అడ్డుకుంటుంటాడు. చివరకు ఆ ముగ్గురూ భూమిపైకి రావడంతో కథలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకి ఏం జరిగిందో థియేటర్‌లో చూడాల్సిందే. అల్లరి నరేశ్‌కు జోడీగా సురభి పురాణిక్‌ నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్‌ 4న విడుదల కానుంది.

Advertisement
Advertisement