Nepal Flash Floods | వరద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ వీడియో
Nepal Flash Floods | హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన వరదలకు (Nepal Flash Floods)అనేక ప్రాంతాలు కనుమరుగయ్యాయి. తాజాగా నువాకోట్ (Nuwakot) జిల్లా త్రిశూలి బజార్ (Trishuli Bazaar)ను వరద ప్రవాహం ముంచెత్తింది. దీంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
International | Published On Aug 28, 2026, 11.44 am IST
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్ : అది నేపాల్‌లోని నువాకోట్ (Nuwakot) జిల్లా త్రిశూలి బజార్ (Trishuli Bazaar). అక్కడి ప్రజలు ఎప్పటిలానే తమ రోజును ప్రారంభించారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. పనులకు వెళ్లే వాళ్లు, దుకాణదారులు, స్కూల్ పిల్లలతో మార్కెట్ ప్రాంతం కిక్కిరిపోయి ఉంది. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
వరద రూపంలో మృత్యువు తరుముకొచ్చింది. నీటి ప్రవాహాన్ని చూసిన స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్కెట్ ప్రాంతం బురద, శిథిలాల దిబ్బగా మారుతుందని వారు ఊహించలేదు. ఆభరణాలు, దుస్తుల దుకాణాలు, ఇతర వ్యాపారాలతో కళకళలాడే ఆ పట్టణం వరదల దెబ్బకు క్షణాల్లో కనుమరుగైపోయింది. త్రిశూలి బజార్‌లోని వరద నీరు మృత్యువులా తరుముకొస్తుంటే జనం పరుగులు తీస్తున్న షాకింగ్ వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
🚨THIS IS NOT AI 🚨
This is how the flood entered Trishuli Bazaar.🙏 pic.twitter.com/QPs06wQzit
— Mufadal Vohara (@Shailes85620661) August 27, 2026
హిమాలయ దేశం నేపాల్‌లో బుధవారం సంభవించిన జలప్రళయం (Nepal Flash Floods) పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ప్రకృతి చేసిన విలయతాండవానికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరింది. 1,498 మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారిలో 290 మంది భారతీయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇక ఈ వరదలకు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. దుకాణాలు, రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నువాకోట్, రసువా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా బురద, వరద, భవన శిథిలాలే దర్శనమిస్తున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
Also Read..
నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
గ్రాండ్ చెస్ టూర్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత
సంబంధిత వార్తలు

Earrings Stolen | నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
ఆగస్టు 28, 2026

Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
ఆగస్టు 28, 2026

Nepal Flash Floods | నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు : విదేశాంగ శాఖ
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
- ●TGSRTC | రాఖీ పండుగ.. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ అదనపు బాదుడు
- ●CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.31వేలు తగ్గిన బంగారం ధర..
- ●Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. ఐటీ షేర్ల ర్యాలీ..

Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

TGSRTC | రాఖీ పండుగ.. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ అదనపు బాదుడు

CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.31వేలు తగ్గిన బంగారం ధర..



