Supreme Court | 13 రోజులు భార్యతో మాట్లాడకపోవడం క్రూరత్వం కాదు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court | భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. 13 రోజులు భార్యతో మాట్లాడకపోవడం క్రూరత్వం కిందకు రాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవల కారణంగా కొంతకాలం మాట్లాడుకోకపోవడం సహజమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. 13 రోజులు భార్యతో మాట్లాడకపోవడం క్రూరత్వం కిందకు రాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవల కారణంగా కొంతకాలం మాట్లాడుకోకపోవడం సహజమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 13 రోజులు భార్యతో మాట్లాడకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఒమన్‌లో ఉన్న భర్త ఫోన్ చేయకపోవడం వల్లే భారత్‌లో ఉన్న భార్య ఆత్మహత్య చేసుకుందని చేసిన ఆరోపణలను కూడా కోర్టు తిరస్కరించింది. IPC సెక్షన్ 498A కింద భర్తకు తమిళనాడులోని ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
అసలేం జరిగిందంటే..?
తమిళనాడుకు చెందిన జయేశ్ కన్నా వృత్తిరీత్యా ఇంజినీర్. ఒమన్, మస్కట్‌లో ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. జయేశ్ భార్య సంగీత మాత్రం తమిళనాడులోనే ఉంటుంది. 2015 జనవరి 31వ తేదీన సంగీత ఆత్మహత్య చేసుకుంది. అయితే సంగీతతో 13 రోజుల పాటు ఫోన్‌లో మాట్లాడేందుకు భర్త జయేశ్ నిరాకరించడంతోనే తీవ్ర మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో జయేశ్ కన్నాకు ఐపీసీ సెక్షన్ 498ఏ కింద ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది. దీంతో జయేశ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. చివరకు సుప్రీంకోర్టును జయేశ్ ఆశ్రయించాడు. జస్టిస్ జేకే మహేశ్వరి, అతుల్ ఎస్ చందుర్కర్ ధర్మాసనం విచారణ చేపట్టి.. జయేశ్, సంగీత దంపతుల మధ్య నేరం ఎక్కడా కనిపించలేదని, 13 రోజులు మాట్లాడకపోవడం క్రూరత్వంగా పరిగణించలేమని తెలిపింది. పిటిషనర్ చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.
సంబంధిత వార్తలు

Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మళ్లీ బుల్డోజర్..? హైదరాబాద్ ఊపిరితిత్తులపై దాడి..!
జూన్ 12, 2026

Supreme Court | మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోండి.. సివిల్ సర్వెంట్లు రోహిణి సింధూరి, రూపా కేసులో సుప్రీం వ్యాఖ్యలు..!
జూన్ 12, 2026

Meenakshi Natarajan | నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●Peto's Paradox | ఏనుగులు, తిమింగలాలకు క్యాన్సర్ ఎందుకు రాదంటే.. సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తున్న జన్యు రహస్యాలివే!
- ●Maheshkumar Goud | మీనాక్షిని బలి చేశారు
- ●Rajnath Singh | యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్
- ●Jeevan Reddy | రేవంత్ కుట్ర ఫలితమే.. తెలంగాణలో కరువు : జీవన్ రెడ్డి
- ●NDDB | ఎన్డీడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో చంద్రశేఖర్‌రెడ్డి, అమిత్‌రెడ్డి భేటీ
- ●Nayanthara | పూజా హెగ్డే హారర్ సినిమాలో గెస్ట్‌గా లేడీ సూపర్ స్టార్

Peto's Paradox | ఏనుగులు, తిమింగలాలకు క్యాన్సర్ ఎందుకు రాదంటే.. సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తున్న జన్యు రహస్యాలివే!

Maheshkumar Goud | మీనాక్షిని బలి చేశారు

Rajnath Singh | యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్

Jeevan Reddy | రేవంత్ కుట్ర ఫలితమే.. తెలంగాణలో కరువు : జీవన్ రెడ్డి



