త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | మీనాక్షిని బ‌లి చేశారు

Maheshkumar Goud | ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓటు చోరీ చేసి.. ఇప్పుడు సీటు చోరీ చేసి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ను బ‌లి చేశార‌ని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రధాని ఇంతలా దిగజారి ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించకపోవడం విచారకరమ‌న్నారు.

S

Telangana | Published On Jun 13, 2026, 3.20 pm IST

Maheshkumar Goud | మీనాక్షిని బ‌లి చేశారు
Advertisement
  • రాజ్యస‌భ‌లో బ‌లం పెంచుకోవ‌డానికే కుట్ర చేశారు
  • ప్ర‌ధాని ఇంత దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తార‌ని అనుకోలే
  • బీజేపీ ఫాసిస్టు విధానాలు క‌నిపిస్తున్నాయి
  • ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌రం
  • ప్ర‌జాస్వామ్మ దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా అనే సందేహం క‌లుగుతోంది
  • మీడియా స‌మావేశంలో టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓటు చోరీ చేసి.. ఇప్పుడు సీటు చోరీ చేసి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ను బ‌లి చేశార‌ని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రధాని ఇంతలా దిగజారి ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని, 24 గంటల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించకపోవడం విచారకరమ‌న్నారు. శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై మండిప‌డ్డారు.

మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా? అనేది అనుమానం కలుగుతుంది. కేసు లేదు ఏమి లేదు నోటీసు మాత్రమే ఇచ్చింది. పసలేని కేసును పట్టుకొని దుర్బుద్ధితో నోటీసు మాత్రమే ఇచ్చింది. రాజ్యసభలో బలం పెంచుకోవాలని కుట్రకు పూనుకున్నారు. ప్రధాని మంత్రి ఆఫీసు ఇన్వాల్వ్ అయ్యి కేసును తప్పుదోవ పట్టించారు. ఈ విషయంలో ఉరి వేసినా తప్పులేదు. రాజకీయ ఒత్తిడి వల్ల ఆర్‌వో ఆఫీసులో కూర్చుని ప్రధాని నియంతలా వ్యవహరించడం శోచనీయం అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ ఫైర‌య్యారు.

గాంధేయ వాది, నిజాయితీకి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు. బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీనాక్షి నాకు సోదరి లాంటివారు. ఆమె విషయంలో కొంత మంది బీజేపీ నేతలు సానుభూతి తెలిపినట్లు తెలిసింది. బీజేపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. లీకు వీరులు గ్రీకు వీరులు ఉంటే సీఎం సమగ్రంగా విచారిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మాపై బురద జల్లుతున్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజం. అంత మాత్రాన కుట్రకు పాల్పడరు అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని అవ‌మానిస్తారా?

రాజ్యాంగాన్ని ఇంత దుర్మార్గంగా అవమానిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఇలా వ్యవహరిస్తే మోడీ ప్రధాని అయ్యేవారా? ముఖ్యమంత్రి అయ్యేవారా? బెంగాల్, మహరాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో దేశ ప్రజలు చూశారు. 12 ఏళ్లలో మోదీ చేసింది ఏమి లేదు. షబ్బీర్ అలీ ఆరోపణల‌పై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదు. నా ఆస్తులు, నా వ్యక్తిత్వం నేను ఏంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు. చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీ సీఎం సమక్షంలో చేర్పించారు. షబ్బీర్ అలీకి షోకాజ్ ఇచ్చాం. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండి షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదు అని మ‌హేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చ‌రించారు.

మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరం. ఏడాది కిందటి మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. మీనాక్షి నటరాజన్ గురించి కేటీఆర్ స్పందించాల్సింది. నేను ఏంటో కేటీఆర్ కంటే హరీష్ రావుకు బాగా తెలుసు. ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింద‌ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి అని ఆయ‌న పేర్కొన్నారు.

వివ‌ర‌ణ ఇచ్చి పాద‌యాత్ర చేయండి..

కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాలు సమానం. ఫోర్త్ సిటీ అడ్డుకుంటామని అనడం మూర్ఖత్వం. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం లేదు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పదేళ్ల కాలంలో ఆర్థిక విధ్వంసం, భూ దోపిడీ, అప్పుపై వివరణ ఇచ్చి బస్సు యాత్ర, పాదయాత్రలు చేయండి. పాదయాత్రలు రాజకీయాల్లో అనేక సార్లు మలుపు తిప్పిన ఘటనలు ఉన్నాయి. కాంగ్రెస్ జీవన్ రెడ్డిది ముగిసిన అధ్యాయం. అరాచకం చేస్తామని బీజేపీ ఎంపీ అరవింద్ నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ఓడిపోతారు అని మ‌హేశ్‌కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు.

ప్రైవేట్ కేసు ఆధారంగా తిర‌స్క‌రించారు..

8వ తేదీన‌ మీనాక్షి నటరాజన్ కేసు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. కేసు చేరవేసిన వారిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యింది. నామినేషన్ తిరస్కరణ అనేది దేశ రాజకీయాల్లో ఒక కళంకం. ప్రైవేట్ కేసు ఆధారంగా నామినేషన్ తిరస్కరించడం హేయమైన చర్య అని టీపీసీసీ చీఫ్ ఫైర‌య్యారు.

Advertisement
Advertisement