త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | రేవంత్ కుట్ర ఫ‌లిత‌మే.. తెలంగాణ‌లో క‌రువు : జీవ‌న్ రెడ్డి

Jeevan Reddy | ఎల్‌నినో ప్ర‌భావం మ‌న నెత్తి మీద తాండ‌విస్తోంద‌ని బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఫ‌లిత‌మే తెలంగాణ రాష్ట్రం క‌రువుతో త‌ల్ల‌డిల్లిపోతుంద‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు.

S

Telangana | Published On Jun 13, 2026, 3.06 pm IST

Jeevan Reddy | రేవంత్ కుట్ర ఫ‌లిత‌మే.. తెలంగాణ‌లో క‌రువు : జీవ‌న్ రెడ్డి
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఎల్‌నినో ప్ర‌భావం మ‌న నెత్తి మీద తాండ‌విస్తోంద‌ని బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఫ‌లిత‌మే తెలంగాణ రాష్ట్రం క‌రువుతో త‌ల్ల‌డిల్లిపోతుంద‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు. వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో జీవ‌న్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ క‌రువు ప్రకృతి ప్ర‌సాదించిన క‌రువు కాదు.. రేవంత్ రెడ్డి కుట్ర ఫ‌లిత‌మే క‌రువు చూడ‌బోతున్నాం. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్య‌త వ‌హించాలి. ఇక నిన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2027 జూన్ నాటికి మేడిగ‌డ్డ మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేస్తామ‌ని చెప్పారు. మ‌ర‌మ్మ‌తులు చేయ‌డం మీ వ‌ల్ల కాదు.. మ‌ళ్లీ కేసీఆర్ సీఎం కావాలి.. వారి చేతుల మీద‌నే కాళేశ్వ‌రం ప్రాజెక్టు పున‌రుద్ధ‌ర‌ణ జ‌రుగుత‌ది.. మ‌న ప్రాంతం స‌స్య‌శ్యామ‌లం అవుతుంది అని జీవ‌న్ రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ను దోషిగా నిల‌బెట్టాల‌నే కుట్ర‌తో మేడిగ‌డ్డ‌ను నిర్ల‌క్ష్యం

సీఎంగా కేసీఆర్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. లౌక్యం ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ, మ‌హారాష్ట్ర స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో.. మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందింది. దాని ప్ర‌భావంతో వేముల‌వాడ సుభిక్షం అవుతుంది. వ‌ర‌ద కాల్వ‌లో నీళ్లు ఉన్నాయి. ఇది కేసీఆర్ ఆలోచ‌నా ఫ‌లిత‌మే. ప్ర‌కృతి మ‌న చేతుల్లో లేదు. పెద్ద‌ పెద్ద ప్రాజెక్టులు నిర్మాణ ద‌శ‌లో కుంగిపోయాయి. మేడిగ‌డ్డ‌కు కేవ‌లం ప‌గుళ్లు వ‌చ్చాయి. 30 మాసాల్లో మ‌ర‌మ్మ‌తు చేయ‌ని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వం ఇది. ద‌శాబ్ద కాలంలో ప్రాజెక్టు నిర్మించి దాని ఫ‌లాలు అంద‌జేశారు కేసీఆర్. హైద‌రాబాద్ తాగునీటి, పారిశ్రామిక అవ‌స‌రాలు తీర్చే విధంగా కాళేశ్వ‌రం తీర్చిదిద్దారు. కేసీఆర్‌ను దోషిగా నిల‌బెట్టాల‌నే కుట్ర‌తో మేడిగ‌డ్డ‌ను నిర్ల‌క్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై జీవ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు.

అద‌న‌పు తూకం లేకుండా ధాన్యం సేక‌ర‌ణ చేశారా..?

సాగునీటి ప్రాజెక్టులే కాదు పండించిన పంట‌ను కూడా కొనుగోలు చేయ‌లేని ప‌రిస్థితి, అస‌మ‌ర్థ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వానిది. ప్ర‌తి రైతు పండించిన పంట‌లో క్వింటాల్‌కు 10 కిలోలు ద‌గా చేయ‌బ‌డ్డ‌డు. వేముల‌వాడ‌లోనే కాదు తెలంగాణ‌లో అద‌న‌పు తూకం లేకుండా ధాన్యం సేక‌ర‌ణ చేశారా..? అని జీవ‌న్ రెడ్డి నిల‌దీశారు.

Advertisement
Advertisement