Medical Student | కాపీ కొడుతూ దొరికిపోయిన మెడికల్ స్టూడెంట్.. ఇన్విజిలేటర్‌పై దాడి
Medical Student | కర్ణాటకలోని కలబురగి (Kalaburagi) జిల్లాలో ఓ మెడికల్ స్టూడెంట్ (Medical Student) కాపీ (Cheating) కొడుతూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోయాడు.
Medical Student | కర్ణాటకలోని కలబురగి (Kalaburagi) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ మలకారెడ్డి హోమియోపతి కళాశాలలో (Dr Malakareddy Homoeopathic College) జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షల్లో ఓ మెడికల్ స్టూడెంట్ (Medical Student) కాపీ (Cheating) కొడుతూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోయాడు. అయితే, ఆ విద్యార్థి ఇన్విజిలేటర్‌పై దాడి చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పరీక్ష హాల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
మెటీరియా మెడికా పరీక్ష సందర్భంగా షాబాజ్ అనే విద్యార్థి ఫోన్‌లో చూసి కాపీ కొడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో ఇన్విజిలేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరాజ్ కుమార్ అతడి పేపర్స్‌ను తీసుకుని బయటకు వెళ్లిపోవాలంటూ ఆదేశించాడు. ఆగ్రహించిన విద్యార్థి ప్రొఫెసర్‌పై దాడి చేశాడు. అప్రమత్తమైన స్టూడెంట్స్.. వెంటనే షాబాజ్‌ను అడ్డుకున్నారు. దీంతో అతడు బయటకు వెళ్తున్నట్లు ఎగ్జిట్‌వైపు వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి ప్రొఫెసర్‌ను కొట్టాడు. ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటనను కళాశాల యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అంతేకాదు, తదుపరి పరీక్షలు రాయకుండా అతడిపై నిషేధం విధించింది.
https://x.com/HateDetectors/status/2025110107139522859
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





