Moringa Cultivation | టీచర్ జాబ్‌ను వదిలేసి.. మునగ సాగు వైపు అడుగులు.. రెండేండ్లలోనే రూ. 2 కోట్ల టర్నోవర్..
Moringa Cultivation | ఆమె వృత్తిరీత్యా టీచర్( teacher ).. ఓ రెండు దశాబ్దాల పాటు టీచర్‌గా రాణించడమే కాదు.. సొంతంగా ప్రయివేటు పాఠశాలలను( Private Schools ) నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారు. కానీ కన్నడ మీడియం వద్దనుకుని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల వైపు గ్రామీణ ప్రజలు పరుగులు పెట్టడంతో.. ఆమె విద్యాసంస్థలు మూతపడే స్థాయికి వచ్చాయి. చివరకు అన్ని స్కూళ్లను మూసి వేసి.. వ్యవసాయం( Agriculture ) వైపు అడుగులేశారు. కేవలం మునగ సాగు( Moringa Cultivation ) చేసి.. రెండేండ్లలోనే రూ. 2 కోట్ల టర్నోవర్‌కు చేశారు. మరి టీచర్ సురేఖ రాజ్ కుమార్( Surekha Rajkumar ) గురించి తెలుసుకోవాలంటే కర్ణాటక( Karnataka )లోని కలబురాగి జిల్లా( Kalaburagi )లో కాలు మోపాల్సిందే.
Agriculture | Published On Jun 26, 2026, 9.42 am IST
surekha-moringa
Moringa Cultivation | సురేఖ రాజ్ కుమార్( Surekha Rajkumar ) .. బీఏ, బీఎడ్ చేశారు. ఆ తర్వాత టీచర్( Teacher ) వృత్తిని ఎంచుకున్నారు. సొంతంగానే తన సోదరితో కలిసి కలబురాగి జిల్లా( Kalaburagi ) లోని గ్రామీణ ప్రాంతాల్లో కన్నడ మీడియం స్కూల్స్‌ను స్థాపించారు. 2007లో ఒకే ఒక్క ప్రైమరీ స్కూల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బసవ రత్న స్కూల్స్( Basava Ratna Schools ) పేరిట.. కలబురాగి జిల్లాలోని పలు గ్రామాల్లో తమ విద్యాసంస్థలను నెలకొల్పారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలనే సంకల్పంతో సురేఖ బయల్దేరారు. అయితే ఆ పాఠశాలలు ఓ 20 ఏండ్ల పాటు బ్రహ్మాండంగా నడిచాయి. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులు కూడా తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన కావాలని కోరుకున్నారు. దీంతో కన్నడ మీడియంతో కొనసాగుతున్న విద్యాసంస్థలకు ఆదరణ తగ్గింది. చివరకు మూతపడే స్థాయికి వచ్చింది పరిస్థితి. విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే సురేఖ తన బసవ రత్న విద్యాసంస్థలను మూసేశారు.
ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో భాగంగానే.. సురేఖ వ్యవసాయ( Agriculture ) రంగం వైపు మొగ్గు చూపారు. ఇక వారసత్వంగా వచ్చిన 21 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. హోనగుంట గ్రామంలో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అయితే 21 ఎకరాల భూమిలో నీటి సదుపాయం కూడా లేదు. దీంతో ఆమె 2024లో ఆ భూమిని సాగుకు అనుకూలంగా మార్చారు. సాగునీటి కోసం బోర్ వేయించారు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. ఒక చిన్న ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఇదంతా చేయడానికి రూ. 16 లక్షలు ఖర్చు అయింది.
ఆ మరుసటి రోజే.. 120 కిలోమీటర్లు ప్రయాణించి..
అయితే ఈ భూమిలో మొదట నిమ్మ సాగు చేయాలనుకున్నారు. కానీ ఆ పంట చేతికి రావడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్పి అటు వైపు మొగ్గు చూపలేదు. అరటి తోట పెడుదామనుకున్నారు.. కానీ ఆ ప్రాంతంలో బలమైన గాలులు ఉండడం వల్ల అది కూడా సాధ్యం కాలేదు. ఇక ఆన్‌లైన్‌లో శోధించగా, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న మునగ పంట( Moringa Cultivation ) ఆమె కంట పడింది. ఇంకేముంది.. ఆ మరుసటి రోజే.. 120 కిలోమీటర్లు ప్రయాణించి.. అప్పటికే ఆ ప్రాంతంలో సాగు చేస్తున్న మునగ పంటను సురేఖ పరిశీలించారు. ఇక ఆ రైతు వద్దనే ఓడీసీ-3( ODC-3 ) వెరైటీకి చెందిన మునగ విత్తనాలను రూ. 3 వేలకు 11 కిలోలు కొనుగోలు చేశారు. ఇక తండ్రి, సోదరుడి సహాయంతో మునగ విత్తనాలను నాటారు. 2024, జులై 14న మొత్తం 15 ఎకరాల్లో మునగ సాగు ప్రారంభించారు. మిగతా భూమిలో రెండు వారాలు ఆగి సాగు చేశారు.
ఎకరానికి 100 క్వింటాళ్ల దిగుబడి

అయితే ఈ మునగ సాగు( Moringa Cultivation ) కంటే ముందు.. సురేఖ ఆ పొలంలో పత్తి పంట వేశారు. ఆ పత్తి పంటను పూర్తి ధ్వంసం చేసిన అనంతరం.. ఆవు పేడను ఉపయోగించి నేలను సారవంతం చేశారు. అనంతరం 14 అడుగుల దూరంలో ఒక్కో మొక్కను నాటారు. ఇక పూర్తిస్థాయిలో సేంద్రీయ పద్ధతులను ఉపయోగించి, మునగ సాగు చేశారు. మొత్తానికి 2025 ఫిబ్రవరి నాటికి మొదటి పంట కోతకు వచ్చింది. అధిక దిగుబడి కూడా వచ్చింది. ఈ పంటలో ఎకరానికి 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అంటే సుమారు 10 వేల కిలోల మునగకాయలు( Drumstick ) పండాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో కిలో మునగ కాయలను రూ. 45 చొప్పున విక్రయించారు. మార్చి చివరి నాటికి ఆ ధరలు రూ. 20కి పడిపోయాయి.
మొత్తానికి పరాగ సంపర్కం ప్రయోగం ఫలించింది..
అయితే ఉద్యానవన శాఖ( Horticulture Department ) సూచన మేరకు 2025 మే నెలలో మునగ కొమ్మలను నరికేశాం. అదే సమయంలో వర్షాలు బాగా కురియడంతో.. పూతను కొల్పోయాం. దీంతో భారీగా నష్టం సంభవించింది. ఆ తర్వాత అనేక పరిశోధనలు చేశారు సురేఖ. చివరకు జీవామృతం, ఆవుపేడ వంటి సేంద్రీయ ఎరువులను ఉపయోగించడంతో.. అదే ఏడాది అక్టోబర్ నాటికి మళ్లీ పూత పూయడం ప్రారంభించాయి. నవంబర్ నాటికి చెట్లన్నీ కోలుకున్నాయి. కానీ కాయలు కాయడం లేదు. దీంతో మళ్లీ ఆమె శోధించారు. పరాగ సంపర్కం మెరుగుపరిచేందుకు రూ. 5,500 చొప్పున ఐదు తేనెటీగల బాక్సులను కొనుగోలు చేశారు. మొత్తానికి పరాగ సంపర్కం ప్రయోగం ఫలించింది. ఆ తర్వాత దిగుబడి కూడా అధికంగా వచ్చింది.
రెండేండ్లలోనే రూ. 2 కోట్ల టర్నోవర్‌కు
ప్రస్తుతం సురేఖ పొలంలో మొత్తం 7 వేల మునగ చెట్లు ఉన్నాయి. ఒక్కో ఎకరా పొలంలో 330 చెట్ల చొప్పున సాగు చేశారు. ఒక కిలో మునగ విత్తనాలను రూ. 3 వేలకు విక్రయిస్తున్నారు. 300 క్వింటాళ్ల మునగకాయలు దిగుబడి రావడంతో.. ఒక్కో కేజీ మునగ కాయలను రూ. 100 చొప్పున విక్రయించారు. ఇలా రూ. 30 లక్షల వరకు సంపాదించారు. ఇక మునగ ఆకు పౌడర్‌ను రూ. 1000కి(కేజీ) విక్రయించారు. అలా మునగ కాయలు, విత్తనాలు, పౌడర్ వంటి ఉత్పత్తులను విక్రయించి.. రెండేండ్లలోనే రూ. 2 కోట్ల టర్నోవర్‌కు చేరారు సురేఖ. ప్రస్తుతమున్న చెట్లే మరో పదేండ్ల వరకు దిగుబడిని ఇస్తాయని సురేఖ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత లాభాలు గడిస్తామన్న దీమాతో సురేఖ ఉన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
ఆగస్టు 15, 2026

bans sale of gutka | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం
ఆగస్టు 12, 2026

Prakash Raj | ఓటు షిఫ్ట్ చేశామంతే... తొలగించలేదు.. ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించిన ఈసీ
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీలలో నష్టాలు..
- ●Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్
- ●Auto Bandh | ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్
- ●Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్
- ●Massive Fire | హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు 9 మంది మృతి
- ●Restaurant Food | రెస్టారెంట్ ఫుడ్ తిని ఐదేండ్ల చిన్నారి మృతి.. దవాఖానలో మరో నలుగురు

Stock Markets | ఆసియా మార్కెట్ల పతనం.. సెన్సెక్స్, నిఫ్టీలలో నష్టాలు..

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్

Auto Bandh | ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్లు బంద్

Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్



