త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | అతిథుల వివ‌రాల‌ను అందించండి.. గ‌ణేశ్ మండ‌ప నిర్వాహ‌కుల‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

CM Revanth Reddy | ఈ నెల 14 నుంచి వినాయ‌క చ‌వితి నేప‌థ్యంలో.. ఆయ మండ‌పాల‌కు వ‌చ్చే అతిథుల వివ‌రాల‌ను స్థానిక క‌మిష‌న‌రేట్‌కు అందించాల‌ని నిర్వాహ‌కులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

S

Hyderabad | Published On Sep 12, 2026, 4.16 pm IST

CM Revanth Reddy | అతిథుల వివ‌రాల‌ను అందించండి.. గ‌ణేశ్ మండ‌ప నిర్వాహ‌కుల‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 14 నుంచి వినాయ‌క చ‌వితి నేప‌థ్యంలో.. ఆయ మండ‌పాల‌కు వ‌చ్చే అతిథుల వివ‌రాల‌ను స్థానిక క‌మిష‌న‌రేట్‌కు అందించాల‌ని నిర్వాహ‌కులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని శాస‌న‌మండ‌లి కాన్ఫ‌రెన్స్ హాల్‌లో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో గ‌ణేశ్ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై సీఎం స‌మీక్షించారు.

ఈ స‌మీక్షా స‌మావేశానికి మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, అజారుద్దీన్, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, శ్రీగ‌ణేశ్‌, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హైడ్రా క‌మిష‌న‌ర్లు, పోలీసు ఉన్న‌తాధికారులు, గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునర్దుద్ధరించాం. మీ సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా నేనే సమీక్ష నిర్వహిస్తున్నా. మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలు స్థానిక కమిషనరేట్‌కు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఊహించని పరిణామాలు జరగినపుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుంది అని సీఎం తెలిపారు.

గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్

దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలి. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందన్నారు.

ప్రత్యేక అధికారులను నియమించాలి

అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువుల వద్ద చుట్టూ క్రేన్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలి అని సీఎం సూచించారు.

స‌మ‌స్య‌లు ఏమున్నా ప‌రిష్క‌రిస్తాం

హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత వహించాలి. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలి. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement