త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anushka Sharma | బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మైథాల‌జీ మూవీకి సీక్వెల్ – గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ హ‌నుమాన్ అంశ్‌కు సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ గెస్ట్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీక్వెల్‌లో న‌టించ‌డానికి వీరిద్ద‌రు అంగీక‌రించిన‌ట్లు చెబుతోన్నారు.

N

Entertainment | Published On Sep 12, 2026, 4.25 pm IST

Anushka Sharma | బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మైథాల‌జీ మూవీకి సీక్వెల్ – గెస్ట్ రోల్స్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌
Advertisement

Anushka Sharma | చిన్న సినిమాగా థియేట‌ర్ల‌లో రిలీజైన హ‌నుమాన్ అంశ్ బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ప్రభంజ‌నాన్ని సృష్టిస్తోంది. కేవ‌లం రెండు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మైథాల‌జీ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు రెండు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇండియాలోనే అత్య‌ధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

కోహ్లి...అనుష్క‌...

ఆధ్యాత్మిక గురువు క‌రోలీ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. పార్ట్ 2ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఈ సీక్వెల్‌లో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లితో పాటు అత‌డి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ గెస్ట్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  క‌రోలీ బాబా ఆశ్ర‌మాన్ని మూడేళ్ల క్రితం కోహ్లి, అనుష్క ద‌ర్శించారు. ఆయ‌న సిద్ధాంతాలు, బోధ‌న‌ల‌ను వీరు అనుస‌రిస్తుంటారు.

హైలైట్‌...

సీక్వెల్‌లో కోహ్లి, అనుష్క పాత్ర‌లు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బాబా ఆధ్యాత్మిక బోధ‌న‌ల ప్ర‌భావం వీరిద్ద‌రి జీవితాల్లో ఎలాంటి మార్పుల‌ను తీసుకొచ్చాయ‌న్న‌ది హ‌నుమాన్ అంశ్ 2లో చూపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. అనుష్క శ‌ర్మ పాత్ర నిడివి ఎక్కువ‌గానే ఉండ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. సినిమాలో న‌టించ‌డానికి వీరిద్ద‌రు అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. కోహ్లి, అనుష్క‌తో పాటు హాలీవుడ్ హీరోయిన్ జులియా రాబ‌ర్ట్స్ కూడా ఈ సినిమాలో అతిథిగా క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వంద కోట్ల బ‌డ్జెట్‌...

ఇప్ప‌టికే ఈ సీక్వెల్‌కు సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింద‌ని అంటున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుతున్నారు. పార్ట్ వ‌న్‌ను రెండు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందించ‌గా...సీక్వెల్ కోసం మాత్రం మేక‌ర్స్ వంద కోట్ల‌కుపైనే ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ సీక్వెల్‌లో ప‌లు భాష‌ల‌కు చెందిన ఫేమ‌స్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

 

 

 

Advertisement
Advertisement