Mamata Banerjee | టీఎంసీ పేరు, గుర్తు గల్లంతు.. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మమతా బెనర్జీ
Mamata Banerjee | ఉప ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ పేరు, గుర్తును స్తంభింపజేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న మధ్యంతర నిర్ణయాన్ని మమతా బెనర్జీ (Mamata Banerjee) సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేశారు.
Mamata Banerjee | త్రినేత్ర.న్యూస్ : ఉప ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ పేరు, గుర్తును స్తంభింపజేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న మధ్యంతర నిర్ణయంపై మమతా బెనర్జీ (Mamata Banerjee) న్యాయపోరాటానికి దిగారు. ఈసీ నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేశారు. పార్టీలో తలెత్తిన అంతర్గత చీలిక, విభేదాల నేపథ్యంలో ఈసీ జారీ చేసిన ఈ ఉత్తర్వులపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాది అభినవ్ సింగ్ ద్వారా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీఎంసీలో విభేదాలు తలెత్తాయి. పార్టీ రెండుగా విడిపోయింది. ఓ వర్గానికి దీదీ నేతృత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రిటబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. అయితే, వచ్చే నెల 6న జగరనున్న నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల (Bengal bypolls) నేపథ్యంలో పార్టీ గుర్తు, పేరుపై వివాదం మొదలైంది. ఇరు వర్గాలు తామే అసలైన టీఎంసీ అని, పార్టీ గుర్తు తమకే చెందాలని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో ఇరు వర్గాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించకుండా గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం రెండు వర్గాలకు కొత్త పేర్లు, గుర్తులను కేటాయించింది.
మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆధ్వర్యంలోని టీఎంసీ (TMC) పార్టీకి ఎన్నికల సంఘం ఫుట్‌బాల్ (Football) గుర్తును కేటాయించింది. అంతేకాదు, దీదీ వర్గానికి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (Mamata All India Trinamool Congress) పేరును ఖరారు చేసింది. అటు అరూప్ రాయ్, రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ వర్గానికి ఎన్వలప్ (Envelope) గుర్తును కేటాయించింది. ఈ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ (Democratic Trinamool Congress) అనే పేరును ఖరారు చేసింది.
Also Read..
మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి
కొత్త ఛార్జీల మోత.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!
రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సంబంధిత వార్తలు

Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి
సెప్టెంబర్ 19, 2026

TMC | ఫుట్‌బాల్ Vs ఎన్వలప్.. తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త పేరు, గుర్తు
సెప్టెంబర్ 18, 2026

Rahul Gandhi | మొదట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | కనీసం మీ కలెక్షన్ బ్యాచ్లోనైనా ఒక్క ఎస్సీ అయినా ఉన్నడా?
- ●RBI | భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..? రుణం ఇక మరింత ప్రియం..
- ●Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి
- ●Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?
- ●Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ - దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!
- ●UPI Payments | కొత్త ఛార్జీల మోత.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!

RS Praveen Kumar | కనీసం మీ కలెక్షన్ బ్యాచ్లోనైనా ఒక్క ఎస్సీ అయినా ఉన్నడా?

RBI | భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..? రుణం ఇక మరింత ప్రియం..

Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి

Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?



