El Nino Effect | ‘వరి’ వద్దంటున్నారు.. మరి ‘ఆరుతడి’ పంటలేవి..? ఏ పంటకు ఎన్ని నీళ్లు అవసరమో తెలుసా..?
El Nino Effect | ఎల్‌నినో ప్రభావం( El Nino Effect ) వల్ల అస్థిర వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి ద్వారా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
El Nino Effect | త్రినేత్ర.న్యూస్ : ఎల్‌నినో ప్రభావం వల్ల అస్థిర వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి ద్వారా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే తమకున్న పొలంలో నేల స్వభావాన్ని బట్టి పంటలను వేయాల్సి ఉంటుంది. అప్పుడే దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో ఉంటుంది. మరి ఆరుతడి పంటలేవి..? ఏ పంటకు ఎన్ని నీళ్లు అవసరం పడుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఖరీఫ్ సీజన్‌లో అనువైన ప్రధాన ఆరుతడి పంటలు ఇవే..
కందులు
కందుల సాగుకు ప్రధానంగా తేమ తక్కువగా ఉండే ఎర్ర నేలలు, మెట్ట భూములు అనుకూలం. ఎందుకంటే ఈ భూములు నీటిని తక్కువగా శోషించుకుంటారు. తద్వారా నీటి వినియోగం పెద్దగా అవసరం ఉండదు. కాబట్టి తక్కువ నీటితో కంది సాగు చేయొచ్చు.
పెసర, మినుము
పెసర, మినుము పంటలకు కూడా మార్కెట్‌లో భారీగానే డిమాండ్ ఉన్నప్పటికీ, పండిచడం తక్కువగా ఉంది. ఈ పంట 75-90 రోజుల్లో చేతికి వస్తుంది. ఈ పంటల సాగుకు నీటి వినియోగం కూడా చాలా తక్కువ. ఇక ఎర్ర నేలలు, ఇసుక నేలలు ఈ పంటల సాగుకు అనుకూలం.
వేరుశనగ
వేరుశనగ పంటకు ఇసుక, ఎర్ర నేలలు అత్యంత అనుకూలం. భూమి వదులుగా ఉండే నేలల్లో వేరుశనగ దిగుబడి అధికంగా ఉంటుంది. ఈ పంటకు నీటి వినియోగం కూడా తక్కువనే.
సోయాబీన్
సోయాబీన్ పంటకు నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలం. తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సోయాబీన్ సాగు చేయొచ్చు.
జొన్న, సజ్జలు, రాగి
జొన్న, సజ్జలు, రాగి పంటలకు నీరు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఎలాంటి నేలల్లోనైనా ఈ పంటల సాగు చేయొచ్చు. నీటి వనరులు తక్కువగా ఉన్నా, వర్షాలు అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంటలు సులువుగా పెరుగుతాయి.
మొక్కజొన్న
మొక్కజొన్న కూడా అద్భుతమైన ఆరుతడి పంట. తక్కువ నీటి లభ్యత ఉన్న పరిస్థితుల్లోనూ, అధిక దిగుబడిని, మంచి ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటగా ఖరీఫ్ సీజన్‌లో రైతులు దీనిని సాగు చేసుకోవచ్చు.
అయితే.. సాధారణంగా ఖరీఫ్ కాలంలో అధిక వర్షపాతం కారణంగా రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి వనరులు తక్కువగా ఉండే అకాశం ఉండటంతో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు ఉత్తమం అని వ్యవసాయ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
కిలో పంటకు.. ఎన్ని లీటర్ల నీరు అవసరమంటే..?
ICAR డేటా బుక్ ప్రకారం ప్రతి కిలో పంట ఉత్పత్తికి నీటి వినియోగం లీటర్లలో సగటు విలువలు.. ఇవి పంట రకం, మట్టి, నీటిపారుదల పద్ధతులపై ఆధారపడి మారుతాయి.
గోధుమ - 1159 లీటర్లు
వరి - 1408 లీటర్లు
మొక్కజొన్న - 710 లీటర్లు
బంగాళాదుంప - 105 లీటర్లు
సోయాబీన్ - 2860 లీటర్లు
టమాటా - 130 లీటర్లు
ఉల్లిగడ్డ - 147 లీటర్లు
నిమ్మ - 344 లీటర్లు
సంబంధిత వార్తలు

Pochampally Srinivas Reddy | లండన్ పర్యటనలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతల ఘన స్వాగతం
సెప్టెంబర్ 16, 2026

CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు
సెప్టెంబర్ 16, 2026

US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Pochampally Srinivas Reddy | లండన్ పర్యటనలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతల ఘన స్వాగతం
- ●CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు
- ●US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు
- ●Gen Z | సీనియర్లను మట్టికరిపించారు.. జైపూర్ ఎన్నికల్లో జెన్ జీ యూవత
- ●Horoscope | సెప్టెంబర్ 16 రాశిఫలాలు.. ఊహించని సమాచారం అందుతుంది!
- ●Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్

Pochampally Srinivas Reddy | లండన్ పర్యటనలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతల ఘన స్వాగతం

CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు

US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు

Gen Z | సీనియర్లను మట్టికరిపించారు.. జైపూర్ ఎన్నికల్లో జెన్ జీ యూవత



