Justice BV Nagarathna | సుప్రీంకోర్టులో జీఎస్ఐసీసీ పునర్వ్యవస్థీకరణ.. చైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
Justice BV Nagarathna | దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మహిళల భద్రత, లింగ సమానత్వం, లైంగిక వేధింపుల నివారణ కోసం పనిచేసే జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (జీఎస్ఐసీసీ)ను పునర్వ్యవస్థీకరించారు.
Justice BV Nagarathna | దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మహిళల భద్రత, లింగ సమానత్వం, లైంగిక వేధింపుల నివారణ కోసం పనిచేసే జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (జీఎస్ఐసీసీ)ను పునర్వ్యవస్థీకరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాల మేరకు 12 మంది సభ్యులతో కూడిన ఈ కీలక కమిటీకి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్నను చైర్‌పర్సన్‌గా నియమించారు. సుప్రీంకోర్టులో అమల్లో ఉన్న ‘జెండర్ సెన్సిటైజేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ సెక్సువల్ హరాస్మెంట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెస్సల్) రెగ్యులేషన్స్-2013’ ప్రకారం ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నోంగ్మైకపామ్ కోటిశ్వర్ సింగ్, రిజిస్ట్రార్ కావేరి సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, లిజ్ మాథ్యూస్‌లకు కూడా చోటు కల్పించారు. న్యాయవాదులు నీనా గుప్తా, సౌమ్యజిత్ పాణి, సాక్షి బంగా, ప్రభా స్వామి, మహర్విష్ రైన్ సభ్యులుగా నియమితులయ్యారు. అలాగే సుప్రీంకోర్టు బార్ క్లర్క్స్ అసోసియేషన్ ప్రతినిధి సుష్మా రావత్, వివిధా కన్సల్టింగ్ వ్యవస్థాపకురాలు స్నేహ్ శర్మలను కూడా కమిటీలో చేర్చారు. న్యాయవ్యవస్థ, న్యాయవాదులు, సిబ్బంది, స్వతంత్ర ప్రతినిధులకు సముచిత ప్రాధాన్యం కల్పించడం ద్వారా కమిటీ మరింత సమర్థంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telegram Ban India | నీట్ పరీక్ష ముందే షాక్: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. వాట్సప్‌ను మాత్రం ఎందుకు వదిలేశారో తెలుసా?
- ●Adluri Laxman | రూ.2000 కోట్ల స్కామ్ నిరూపిస్తే మంత్రి పదవి వదిలేస్తా: హరీశ్‌రావుకు మంత్రి అడ్లూరి సవాల్
- ●AI Express flight | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి మళ్లింపు
- ●Adilabad Airport | ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ కల సాకారం దిశగా కీలక ముందడుగు
- ●MSI | ఎంఎస్ఐ బంపర్ ఆఫర్.. హై ఎండ్ ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..
- ●Rashmika Mandanna | బాలీవుడ్ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా రష్మిక మందన్న - ఫొటోలు వైరల్

Telegram Ban India | నీట్ పరీక్ష ముందే షాక్: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. వాట్సప్‌ను మాత్రం ఎందుకు వదిలేశారో తెలుసా?

Adluri Laxman | రూ.2000 కోట్ల స్కామ్ నిరూపిస్తే మంత్రి పదవి వదిలేస్తా: హరీశ్‌రావుకు మంత్రి అడ్లూరి సవాల్

AI Express flight | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి మళ్లింపు

Adilabad Airport | ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ కల సాకారం దిశగా కీలక ముందడుగు





