Annamalai | మీ చర్యల వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి మరింత పెరుగుతుంది.. బీజేపీ ప్రభుత్వంపై అన్నామలై విమర్శలు
Annamalai | బీజేపీ ప్రభుత్వంపై వీ ద లీడర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, తమిళనాడు బీజేపీ మాజీ నేత కే అన్నామలై (Annamalai) విమర్శలు గుప్పించారు. నీట్ రీ-టెస్ట్ కోసం చేపట్టిన భారీ భద్రతా ఏర్పాట్లు విద్యార్థుల్లో ఇప్పటికే పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
Annamalai | జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ (NEET Retest) కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వీ ద లీడర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, తమిళనాడు బీజేపీ మాజీ నేత కే అన్నామలై (Annamalai) విమర్శలు గుప్పించారు. నీట్ రీ-టెస్ట్ కోసం చేపట్టిన భారీ భద్రతా ఏర్పాట్లు విద్యార్థుల్లో ఇప్పటికే పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని మరింత పెంచుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్ కోసం కేంద్రం అసాధారణ రీతిలో భద్రతను ఏర్పాటు చేసిందన్నారు. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత, భారత వైమానిక దళం ద్వారా ప్రశ్నపత్రాల రవాణా, నాలుగు లేయర్ల ఏఐ ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ తనిఖీలు, పలుదశల తనిఖీలు వంటి చర్యలు చేపట్టారన్నారు. అదనపు భద్రతా చర్యలు, మెరుగైన పర్యవేక్షణను అమలు చేయడం ద్వారా పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి విద్యార్థి అభినందిస్తారన్నారు.
అయితే, పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు తనిఖీలను పెంచడం, బాడీ స్క్రీనింగ్, పరీక్ష సమయాన్ని అదనంగా 15 నిమిషాలు (180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు) పెంచడం వల్ల విద్యార్థుల్లో ఇప్పటికే పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి మరింత ఎక్కువవుతుందని అభిప్రాయపడ్డారు. పరీక్ష కోసం ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. నీట్ పునఃపరీక్ష కోసం రూపొందించిన ఈ విధానం సమస్యను పరిష్కరించకపోగా.. సరికొత్త సమస్యలను సృష్టించే ప్రమాదం ఉందని అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read..
మత్తుమందు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం.. ఆపై బలవంతంగా మతమార్పిడి
స్కీములన్ని ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అని పిలుద్దాం..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!
- ●Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- ●Madras Regiment | ఆ కక్షతోనే ఆర్మీ ఆయుధాలు దొంగిలింత
- ●Balmuri Venkat | 75 శాతం కానిస్టేబుల్ పోస్టులు ఆదివాసీలకు కేటాయించాలి: బల్మూరి వెంకట్
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ కొనాలంటే ఈ దేశమే బెస్ట్.. భారత్‌తో పోలిస్తే భారీ తేడా..
- ●సభలో కాంగ్రెస్ ఎత్తు.. బయట బీఆర్ఎస్ పైఎత్తు? ‘22ఏ’ చుట్టూ మారుతున్న పొలిటికల్ గేమ్!

AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!

Ponnam Prabhakar | జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

Madras Regiment | ఆ కక్షతోనే ఆర్మీ ఆయుధాలు దొంగిలింత

Balmuri Venkat | 75 శాతం కానిస్టేబుల్ పోస్టులు ఆదివాసీలకు కేటాయించాలి: బల్మూరి వెంకట్






