NIFTY | నిఫ్టీలో మరో 11 కొత్త సెక్టోరల్ ఇండెక్స్‌లు.. పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు..
NIFTY | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)కి చెందిన ఇండెక్స్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ లిమిటెడ్ మంగళవారం 11 కొత్త సెక్టోరల్ ఇండెక్స్‌లను ప్రారంభించింది. వీటిలో నిఫ్టీ పవర్, నిఫ్టీ రిటైల్ తదితర ఇండెక్స్‌లు ఉన్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలోని మొత్తం సెక్టోరల్ ఇండెక్స్‌ల సంఖ్య 34కు చేరుకుంది.
NIFTY | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)కి చెందిన ఇండెక్స్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ లిమిటెడ్ మంగళవారం 11 కొత్త సెక్టోరల్ ఇండెక్స్‌లను ప్రారంభించింది. వీటిలో నిఫ్టీ పవర్, నిఫ్టీ రిటైల్ తదితర ఇండెక్స్‌లు ఉన్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలోని మొత్తం సెక్టోరల్ ఇండెక్స్‌ల సంఖ్య 34కు చేరుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఇండెక్స్‌లలో నిఫ్టీ పవర్, నిఫ్టీ క్యాపిటల్ గూడ్స్, నిఫ్టీ టెలికమ్యూనికేషన్స్, నిఫ్టీ కన్స్ట్రక్షన్, నిఫ్టీ కన్జ్యూమర్ సర్వీసెస్, నిఫ్టీ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, నిఫ్టీ రిటైల్, నిఫ్టీ హాస్పిటల్స్, నిఫ్టీ ఎన్‌బీఎఫ్‌సీ, నిఫ్టీ హౌసింగ్ ఫైనాన్స్, నిఫ్టీ ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఇండైసెస్ లిమిటెడ్ తెలిపిన ప్రకారం, ఈ విస్తరించిన సెక్టోరల్ ఇండెక్స్‌ల శ్రేణి ఇప్పటికే ఉన్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు మరింత సమగ్ర, సూక్ష్మ స్థాయి కవరేజీని అందిస్తుందని వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల ప్రాతినిధ్యం మరింత విస్తృతంగా, లోతుగా కనిపిస్తుందని తెలిపింది.
బెంచ్ మార్క్‌లుగా సేవలు..
కొత్త ఇండెక్స్‌లు అసెట్ మేనేజర్లకు బెంచ్‌మార్క్‌లుగా ఉపయోగపడటంతోపాటు ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), ఇండెక్స్ ఫండ్స్, స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ వంటి ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉత్పత్తులకు రిఫరెన్స్ ఇండెక్స్‌లుగా కూడా పనిచేస్తాయని ఎక్స్ఛేంజ్ తెలిపింది. గతంలో ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఐఐఎస్‌ఎల్)గా పిలిచిన ఎన్‌ఎస్‌ఈ ఇండైసెస్ లిమిటెడ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కు అనుబంధ సంస్థ. ఇది మూలధన మార్కెట్ల కోసం వివిధ రకాల ఇండెక్స్‌లు, ఇండెక్స్ సంబంధిత సేవలను అందిస్తోంది. నిఫ్టీ బ్రాండ్ కింద ఉన్న అనేక ఇండెక్స్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. వీటిలో ప్రామాణిక బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 కూడా ఉంది. సంస్థ అందించే సేవల్లో బ్రాడ్-బేస్డ్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు, సెక్టోరల్ ఇండెక్స్‌లు, స్ట్రాటజీ ఇండెక్స్‌లు, థీమాటిక్ ఇండెక్స్‌లు, కస్టమైజ్డ్ ఇండెక్స్‌లు ఉన్నాయి.
కీలకంగా ఉన్న నిఫ్టీ50..
అలాగే భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్లు, హైబ్రిడ్ ఇండెక్స్‌ల ఆధారంగా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇండెక్స్‌లను కూడా ఎన్‌ఎస్‌ఈ ఇండైసెస్ నిర్వహిస్తోంది. నిఫ్టీ ఇండెక్స్‌ల ఆధారంగా భారత్‌తో పాటు విదేశాల్లో కూడా అనేక పెట్టుబడి ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. వీటిలో ఎన్‌ఎస్‌ఈ, ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్‌ఛేంజ్ ఐఎఫ్ఎస్‌సీ లిమిటెడ్ లో ట్రేడ్ అయ్యే ఇండెక్స్ ఆధారిత డెరివేటివ్స్‌తోపాటు పలు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు కూడా ఉన్నాయి. ప్రధాన నిఫ్టీ 50 ఇండెక్స్ భారత మూలధన మార్కెట్లకు బెంచ్‌మార్క్‌గా మారింది. దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ట్రేడింగ్‌లో కీలక సూచికగా కూడా కొనసాగుతోంది.
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..
జులై 10, 2026

Stock Markets | టీసీఎస్ ఫలితాల జోష్.. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
జులై 10, 2026

Stock Markets | భారీ పతనం అనంతరం.. కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, తగ్గిన చమురు ధరలు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



