Mamitha Baiju | మమితా బైజులో ఈ టాలెంట్ కూడా ఉందా? – హీరోయిన్‌గానే కాకుండా?
ప్రేమలు హీరోయిన్ మమితా బైజు కొత్త అవతారం ఎత్తబోతుంది. సింగర్‌గా మారనుంది. సూర్య హీరోగా నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌లోని ఫస్ట్ సింగిల్‌ను మమితా బైజు పాడినట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jun 16, 2026, 5.43 pm IST
Mamitha Baiju | ప్రేమలు బ్యూటీ మమితా బైజు తనలోని మరో కొత్త టాలెంట్‌ను చూపించేందుకు రెడీ అయ్యింది. సింగర్‌గా అవతారం ఎత్తబోతుంది. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఆగస్ట్ 14న థియేటర్లలోకి రాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా రానున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.
షూటింగ్ కంప్లీట్...
విశ్వనాథ్ అండ్ సన్స్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. రిలీజ్‌కు రెండు నెలలు ముందుగానే మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమోను జూన్ 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటన మమితా బైజు పాడినట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. ఫస్ట్ సింగిల్ ప్రోమో అనౌన్స్‌మెంట్ తాలుకు వీడియో వైరల్ అవుతోంది. ఇందులో పాట పాడటానికి తన స్టూడియోకు వచ్చే సింగర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఎదురుచూస్తూ కనిపించారు. సడెన్‌గా మమితా బైజు రావడం , వీరిద్దరి మధ్య సాగిన ఫన్నీ డైలాగ్స్‌తో ఈ వీడియో ఆకట్టుకుంటుంది. ఇన్‌డైరెక్ట్‌గా ఈ వీడియో ద్వారా ఫస్ట్ సింగిల్‌ను పాడింది మమితానే చెప్పకనే చెప్పారు మేకర్స్. ఈ పాటను మమితా బైజు కేవలం తమిళంలోనే పాడినట్లు సమాచారం. తెలుగులో మాత్రం మరో సింగర్‌గా ఈ పాటను పాడించారని అంటున్నారు.
జననాయగన్ ట్రోల్స్...
దళపతి విజయ్ జననాయగన్ మూవీలో మమితా బైజు ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై మమితా ఓ పాట పాడింది. ఆమె వాయిస్, సాంగ్ పాడిన తీరుపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ ట్రోల్స్ కు విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్‌తో మమితా బైజు బదులివ్వబోతున్నట్లు చెబుతోన్నారు. కాగా కాగా మూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో రమ్యకృష్ణ, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ – నాలుగు భాషల్లో రిలీజ్
జులై 10, 2026

Suriya | సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది – కిస్సిక్ సింగర్ వాయిస్‌తో…
జూన్ 19, 2026

Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ – విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
మే 28, 2026
తాజావార్తలు
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
- ●IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ●Woman dies in hospital | ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

IndiGo Onam Special Flights | పండుగ వేళ ఇండిగో బంపర్ ఆఫర్: హైదరాబాద్ నుంచి కేరళకు స్పెషల్ ఫ్లైట్స్.. పూర్తి వివరాలివే!



