Mallikarjun Kharge | ప్రధాని మోదీని ఉగ్రవాదితో పోల్చిన ఖర్గే.. వివాదం ముదరడంతో వివరణ ఇచ్చిన కాంగ్రెస్ చీఫ్
Mallikarjun Kharge | కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఉగ్రవాదితో పోల్చారు. ఏఐఏడీఎంకే పార్టీ మోదీతో ఎలా కలుస్తోంది..? అంటూ ప్రశ్నించారు.
Mallikarjun Kharge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదితో (Terrorist) పోల్చి వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలిసి పోటీ చేయడంపై ఖర్గే ప్రశ్నించారు. ''ఏఐఏడీఎంకే పార్టీ మోదీతో ఎలా కలుస్తోంది..? అయన (మోదీని ఉద్దేశించి) ఒక ఉగ్రవాది. ఆయనకు సమానత్వంపై నమ్మకం లేదు. ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని నమ్మదు. ఇలాంటి వారితో ఏఐఏడీఎంకే కలుస్తోంది అంటే వీళ్లు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం'' అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని కూటమిని గెలిపించాలి అభ్యర్థించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీకి ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలపై ఖర్గే వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీని తాను ఉగ్రవాది అని అనలేదన్నారు. ప్రజలను, రాజకీయ పార్టీలను ఆయన భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే అన్నానంటూ చెప్పుకొచ్చారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ పర్యటిస్తున్న ఖర్గే.. ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
#WATCH | Chennai, Tamil Nadu | Congress President Mallikarjun Kharge says, "How these AIADMK people, who themselves put the photo of Annadurai, how can they join Modi? He is a terrorist. His party won't believe in equality and justice. These people are joining with them; it means… pic.twitter.com/znLvE7hutP
— ANI (@ANI) April 21, 2026
Also Read..
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. తప్పులు సరిదిద్దుకోవాలి..
మళ్లీ యాక్టివ్ అయిన గులాబీ బాస్.. ఈనెల 27న బీఆర్ఎస్ నేతలతో కీలక భేటీ
కేసీఆర్ చేతిలో జీవన్ రెడ్డి మోసపోవడం ఖాయం : ఎంపీ మల్లు రవి ఘాటు విమర్శలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

PM Modi | UAE క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్‌ను కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



