త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే.. త‌ప్పులు స‌రిదిద్దుకోవాలి..

Harish Rao | రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు ధీమా వ్య‌క్తం చేశారు. ఇక కాంగ్రెస్ ఈ రెండున్న‌రేండ్ల‌లో చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటే.. క‌నీసం డిపాజిట్లు అయినా ద‌క్కుతాయ‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

S

Telangana | Published On Apr 21, 2026, 5.54 pm IST

Harish Rao | వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే.. త‌ప్పులు స‌రిదిద్దుకోవాలి..
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు ధీమా వ్య‌క్తం చేశారు. ఇక కాంగ్రెస్ ఈ రెండున్న‌రేండ్ల‌లో చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటే.. క‌నీసం డిపాజిట్లు అయినా ద‌క్కుతాయ‌ని హ‌రీశ్‌రావు అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే.. రేవంత్ రెడ్డి మాత్రం రంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా ఆపలేరు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయి అని హ‌రీశ్‌రావు తెలిపారు.

కేసీఆర్ ఆదేశాల మేర‌కే ఢిల్లీకి

మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే నేను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాం. అందులో దాచిపెట్టేదేం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడాడు. విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏవిధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి, అలాగే మే 6వ తేదీన హైకోర్టులో రాబోతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్ లాయర్లను సంప్రదించడానికి ఢిల్లీ వెళ్లాం. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచి తాను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఒక ఎమ్మెల్యే అనడం, దాన్ని స్పీకర్ ధ్రువీకరించడం అత్యంత దుర్మార్గం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

Advertisement
Advertisement