త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahua Moitra | సువేందు ప్ర‌తీ విష‌యంలో అండ‌గా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్ర‌శంస‌లు

Mahua Moitra | టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra).. సీఎం సువేందు అధికారిపై (CM Suvendu Adhikari) ప్ర‌శంస‌లు కురిపించ‌డం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ‌కీయ‌ప‌రంగా తమ దారులు వేరైనా సువేందు అధికారితో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి అనుబంధం ఉంద‌న్నారు.

D

National | Published On Jun 24, 2026, 6.07 pm IST

Mahua Moitra | సువేందు ప్ర‌తీ విష‌యంలో అండ‌గా నిలిచారు.. బీజేపీ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్ర‌శంస‌లు
Advertisement

Mahua Moitra | ప‌శ్చిమ బెంగాల్‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ముఖ్యంగా మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్‌లో పార్టీ ఫిరాయింపులు బెంగాల్ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబావుటా ఎగుర‌వేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్న ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra).. సీఎం సువేందు అధికారిపై (CM Suvendu Adhikari) ప్ర‌శంస‌లు కురిపించ‌డం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహువా మాట్లాడుతూ.. రాజ‌కీయ‌ప‌రంగా తమ దారులు వేరైనా సువేందు అధికారితో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి అనుబంధం ఉంద‌న్నారు. ఆయ‌న తృణ‌మూల్ పార్టీలో ఉన్న‌ప్పుడు క‌ష్ట‌కాలంలో త‌న‌కు ఎంతో అండ‌గా నిలిచార‌న్నారు. 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాన‌ని.. రాత్రంతా ఏడుస్తూ ఉంటే అప్పుడు సువేందు త‌న‌కు ధైర్యం చెప్పార‌ని మ‌హువా గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, 2016 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కరింపూర్ నియోజకవర్గం నుంచి తాను తొలిసారి పోటీ చేసిన‌ప్పుడు కూడా త‌న‌కోసం ప్ర‌చారం చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌న్నారు.

ఆ స‌మ‌యంలో కూడా తాను నిర్వ‌హించిన ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొని సువేందు త‌న‌కు అండ‌గా నిలిచార‌ని చెప్పుకొచ్చారు. క్లిష్ట స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన సువేందుకు మ‌హువా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంతేకాదు, ఆయ‌న చేసిన సాయాన్ని తాను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనంటూ చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే పార్టీ ఫిరాయింపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టీఎంసీకి మ‌హువా వ్యాఖ్య‌లు ఆందోళ‌న‌క‌రంగా మారాయి. అంతే కాదు, ఆమె కూడా పార్టీ మారే అవ‌కాశం ఉందంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌మొద‌లైంది.

Advertisement
Advertisement