త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rabies | కుక్క కాటు.. రేబిస్ భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న బ్యాంకు ఉద్యోగి

Rabies | మ‌హారాష్ట్ర‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుక్క కాటుకు (dog bite) గురైన ఓ బ్యాంకు ఉద్యోగి రేబిస్ (Rabies) భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

D

National | Published On Feb 24, 2026, 3.35 pm IST

Rabies | కుక్క కాటు.. రేబిస్ భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న బ్యాంకు ఉద్యోగి
Advertisement

Rabies | మ‌హారాష్ట్ర‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుక్క కాటుకు (dog bite) గురైన ఓ బ్యాంకు ఉద్యోగి రేబిస్ (Rabies) భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. థానేలోని క‌ల్యాణ్ ఈస్ట్‌లోని టిస్‌గావ్ నాకా ప్రాంతంలో ఆదివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉండే స‌హ‌జీవ‌న్ షొసైటీలో నివాసం ఉండే ఆయుష్ విశ్వ‌నాథ్ అమిన్ (30) అనే యువ‌కుడు థానే (Thane)లోని భార‌త్ బ్యాంకులో గ‌త ఎనిమిదేళ్లుగా ప‌నిచేస్తున్నాడు (Maharashtra bank staffer). అయితే, కొన్ని రోజుల క్రితం అత‌డిని కుక్క క‌రిచింది. దీంతో యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అయినా అత‌డికి రేబిస్ భ‌యం ప‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో తీవ్రమైన మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌కు గుర‌య్యాడు.

ఈ క్ర‌మంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆత్మ‌హ‌త్య‌కు ముందు రేబిస్ సోకుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు అమిన్‌ను వెంట‌నే స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు దృవీక‌రించారు. మ‌రోవైపు స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని ప‌రిశీలించారు. ఈ మేర‌కు యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement