త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thirupparankundram | కార్తీక దీపం వివాదం.. సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించిన మ‌ద్రాస్ హైకోర్టు..!

Thirupparankundram | మ‌ద్రాస్ హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. తిరుప‌రంకుండ్రంలోని సుబ్రమణ్య స్వామి ఆలయ యాజమాన్యం సాధారణ ప్రదేశాలతో పాటు 'దీప‌స్తంభం' వద్ద సైతం కార్తీక దీపం వెలిగించుకోవ‌చ్చ‌ని జస్టిస్ జీఆర్ స్వామినాథ‌న్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు మ‌ధురై బెంచ్ సమర్థించింది.

P

National | Published On Jan 6, 2026, 3.55 pm IST

Thirupparankundram | కార్తీక దీపం వివాదం.. సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించిన మ‌ద్రాస్ హైకోర్టు..!
Advertisement

Thirupparankundram | మ‌ద్రాస్ హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. తిరుప‌రంకుండ్రంలోని సుబ్రమణ్య స్వామి ఆలయ యాజమాన్యం సాధారణ ప్రదేశాలతో పాటు 'దీప‌స్తంభం' వద్ద సైతం కార్తీక దీపం వెలిగించుకోవ‌చ్చ‌ని జస్టిస్ జీఆర్ స్వామినాథ‌న్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు మ‌ధురై బెంచ్ సమర్థించింది. అయితే, జ‌స్టిస్ జ‌యచంద్రన్, కేకే రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం, శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందంటూ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌నందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఉత్త‌ర్వుల‌ను పాటించ‌క‌పోవ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని, కేవ‌లం అధికారులు సృష్టించిన ఓ "ఊహాజ‌నిత భూతం" అని ధర్మాసనం పేర్కొంది. ఆగమ శాస్త్రం ప్రకారం.. స్తంభం వ‌ద్ద దీపం వెలిగించేందుకు అనుమ‌తి లేదనేందుకు అప్పీల్‌దారులు ఎలాంటి సాక్ష్యాల‌ను స‌మ‌ర్పించ‌లేద‌ని కోర్టు పేర్కొంది.

కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు..

మతపరమైన ఆచారాల‌కు సైతం కార‌ణాలుంటాయ‌ని, ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించడానికి కారణం భక్తులు చూసి పూజించడం కోసమేనని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఆల‌య యాజ‌మాన్యం దీప‌స్తంభం వ‌ద్ద దీపాన్ని వెలిగించాల‌ని, జిల్లా యంత్రాంగం ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించాల‌ని కోర్టు ఆదేశించింది. ఇది స్మార‌క చిహ్నం కావ‌డంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా షరతులను విధించవచ్చని కోర్టు తెలిపింది. డిసెంబ‌ర్ 12న సింగిల్ బెంచ్ ఉత్త‌ర్వును త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం, వ‌క్ఫ్ బోర్డు స‌వాల్ చేయ‌గా.. కోర్టు విచార‌ణ జ‌రిపింది. అయితే, కొండ‌పై ఉన్న స్తంభం దీప స్తంభం కాద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వాదించింది. అందుకు ఎలాంటి ఆధారాలు లేవ‌ని తెలిపింది. అప్పీల్‌పై విచార‌ణ జ‌రిపిన మ‌ధురై బెంచ్ దీపం వెలిగించ‌కుండా అడ్డుకోవ‌డం అంటే హిందువ‌ల‌కు రాజ్యాంగం ప్ర‌కారం సంక్ర‌మించిన హ‌క్కును ఉల్లంఘించ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

కేసు వివ‌రాల్లోకి వెళితే..

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ప్రసిద్ధ క్షేత్రాల్లో తిరుపరంకుండ్రం మొదటిది. కార్తీక మాసంలో ఇక్కడ‌ కొండపై దీపం వెలిగించడం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. ఇటీవ‌ల ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ స్థ‌లం త‌మ‌దంటూ ఓ వ‌ర్గం ఆరోపించింది. చివ‌ర‌కు ఈ అంశం కోర్టు వ‌ర‌కు వెళ్లింది. తిరుపరంకుండ్రం కొండపై కాశీ విశ్వనాథుడి ఆలయం, మురుగన్ పాదాలు ఉన్నాయని, కార్తీక దీపం వెలిగించడం తమ హక్కు అని హిందువులు పేర్కొంటున్నారు. అదే కొండపై సికందర్ బాదుషా దర్గా ఉండటంతో ఆ కొండ మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందింద‌ని.. హిందువులు దీపం వెలిగించేందుకు వీలు లేద‌ని ద‌ర్గా క‌మిటీ అభ్యంత‌రం చెప్పింది. శాంతిభద్రతల సాకుతో పోలీసులు సైతం అనుమతి నిరాకరించారు. ఈ అంశం మధురై బెంచ్ వ‌ర‌కు చేరింది. ఈ కేసును విచారించిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్ స్వయంగా కొండను పరిశీలించారు.

పురాతన శిలాశాసనాలు, రాతి కట్టడాలను చూసి.. ఆ కొండ కేవలం ఒక వర్గానికి చెందినది కాదని, రెవెన్యూ శాఖకు చెందిన పోరంబోకు భూమి తేల్చారు. హిందువులకు దీపం వెలిగించుకునే హక్కు ఉందంటూ తీర్పును వెలువ‌రించింది. దాంతో హిందూ సంఘాలకు ఊర‌ట క‌లిగింది. అయితే, హిందువుల‌కు అనుకూలంగా తీర్పును ఇవ్వ‌డం అధికార డీఎంకేతో పాటు మిత్ర‌ప‌క్షాలు తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. హిందూత్వ ఎజెండాను అమలు చేస్తున్నారని, ఆయ‌న‌ను న్యాయ‌మూర్తి ప‌ద‌వి నుంచి తొల‌గించాలంటూ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు సైతం లేఖ రాశారు. ఆ త‌ర్వాత తాజాగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ అంశంపై డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించ‌గా.. డీఎంకే ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది.

Read Aslo :

దేశ ప్ర‌జ‌ల‌ను బీసీసీఐ అవ‌మానించింది, ముస్తాఫిజుర్ ఏం చేశాడ‌ని అత‌న్ని త‌ప్పించారు: శ‌శి థ‌రూర్‌

కేంద్రం ప్ర‌తి వ్య‌క్తి బ్యాంకు ఖాతాలో రూ.46,715 జ‌మ చేస్తుందా..?

 

Advertisement

తాజావార్తలు

Advertisement