Madras High Court | అప్పు తిరిగి చెల్లించమనడం.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు
Madras High Court | చాలా మంది నోటి మాటతో అప్పులు ఇస్తుంటారు. అదే నమ్మకంతో అప్పులు తిరిగి చెల్లిస్తుంటారు. అప్పు తిరిగి ఇవ్వని పక్షంలో మందలించి.. ఫలానా సమయానికి ఇవ్వకపోతే బాగుండదని హెచ్చరిస్తుంటారు. అలా అప్పు తిరిగి చెల్లించమని హెచ్చరించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Madras High Court | త్రినేత్ర.న్యూస్ : చాలా మంది నోటి మాటతో అప్పులు ఇస్తుంటారు. అదే నమ్మకంతో అప్పులు తిరిగి చెల్లిస్తుంటారు. అప్పు తిరిగి ఇవ్వని పక్షంలో మందలించి.. ఫలానా సమయానికి ఇవ్వకపోతే బాగుండదని హెచ్చరిస్తుంటారు. అలా అప్పు తిరిగి చెల్లించమని హెచ్చరించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కేసు సారాంశం ఇదే..
తమిళనాడుకు చెందిన సతీయరాజ్ తన స్నేహితుడికి రూ. 4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే సమయానికి ఆ నగదు తిరిగి చెల్లించలేదు. దీంతో సతీయ రాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లాడు. వారం రోజుల్లోగా అప్పు చెల్లించకపోతే చంపేస్తానని అతన్ని సతీయరాజ్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బెదిరించిన రోజే ఆత్మహత్య.. కేసు నమోదు
సతీయరాజ్ బెదిరించిన రోజే అప్పు తీసుకున్న వ్యక్తి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుడి భార్య తన భర్త ఆత్మహత్యకు సతీయరాజ్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్స్ 108, 351(2), తమిళనాడు అధిక వడ్డీ వసూళ్ల నిషేధ చట్టంలోని సెక్షన్ 4, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని సెక్షన్లు 3(1)(r), 3(1)(s), 3(2)(va) కింద కేసు నమోదు చేశారు.
జైలుకు సతీయరాజ్
ఈ కేసులో సతీయరాజ్‌ను పోలీసులు విచారించి జైలుకు పంపారు. 2026 మే నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే అప్పు తిరిగి చెల్లించకుండా ఉండేందుకు తనపై అక్రమ కేసులు బనాయించారని సతీయరాజ్ పేర్కొన్నాడు. తనకు బెయిల్‌కు నిరాకరించిన అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సతీయరాజ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు..
సతీయరాజ్ తన నగదును తిరిగి చెల్లించమనడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు. సతీయరాజ్ వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనడానికి కూడా ఎలాంటి ఆధారాల్లేవు. వారం రోజుల్లో తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అని నిరూపించడానికి కోర్టు ముందు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు సమర్పించలేదు.. కాబట్టి ఈ కేసులో సతీయరాజ్‌కు బెయిల్ మంజూరు చేయొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఆ మేరకు అతనికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






