Goa Nightclub Fire | క్లబ్ ఓనర్స్ అరెస్ట్.. థాయిలాండ్ నుంచి భారత్‌కి తరలింపు
లుత్రా సోదరులపై గోవా పోలీసులు నరహత్య కేసు నమోదు చేశారు. విచారణలో నైట్ క్లబ్‌లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు లేవని గుర్తించారు. సీబీఐ, గోవా పోలీసులు, థాయిలాండ్ పోలీసుల సమన్వయంతో వీరిని భారత్‌కి రప్పిస్తున్నారు.
Goa Nightclub Fire | గోవాలోని ఫేమస్ నైట్ క్లబ్ అయిన బిర్చ్ బై రోమియో లేన్ క్లబ్‌లో డిసెంబర్ 6న జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే క్లబ్ ఓనర్స్ సౌరభ్, గౌరవ్ లుత్రా అక్కడి నుంచి తప్పించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న లుత్రా సోదరులను పోలీసులు థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల పాస్‌పోర్ట్ సస్పెండ్ చేశారు. వాళ్లను భారత్‌కి తీసుకొచ్చే ప్రక్రియ పూర్తయింది.
నరహత్య కేసు నమోదు
లుత్రా సోదరులపై గోవా పోలీసులు నరహత్య కేసు నమోదు చేశారు. విచారణలో నైట్ క్లబ్‌లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు లేవని గుర్తించారు. సీబీఐ, గోవా పోలీసులు, థాయిలాండ్ పోలీసుల సమన్వయంతో వీరిని భారత్‌కి రప్పిస్తున్నారు. భారత అధికారుల సమాచారంతో వీరిని థాయిలాండ్ పోలీసులు ఫుకెట్‌లో అదుపులోకి తీసుకొని వాళ్లను బ్యాంకాక్‌లో ఉన్న ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఇప్పుడు వాళ్లు భారత్‌కి వస్తున్నారు. వీరిని గోవాకు తరలించి అక్కడే వాళ్లపై న్యాయపరమైన చర్యలను పోలీసులు తీసుకోనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






