నార్త్ గోవాలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది మంటల్లో చిక్కుకొని మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గోవా ప్రభుత్వం సీరియస్ అయింది. కఠిన చర్యలు చేపట్టింది. ఈ అగ్ని ప్రమాదానికి బాధ్యులైన క్లబ్ యజమానులపై ఉచ్చు బిగిస్తోంది. సరైన అనుమతులు, పత్రాలు లేకుండానే క్లబ్ లైసెన్స్ పొందినట్లుగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో క్లబ్ ఓనర్స్‌పై గోవా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. యజమానుల కోసం గాలింపు క్లబ్ ఓనర్స్ గౌరవ్ లుత్రా, సౌరభ్ లుత్రా ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ దేశం వదిలి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, సోమవారం ఢిల్లీలో ఐదో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడు క్లబ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే మేనేజర్. సోషల్ మీడియాలో స్పందించిన సౌరభ్ లుత్రా ఈ క్లబ్ ఓనర్లలో ఒకరైన సౌరభ్ లుత్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని పోస్ట్ చేశారు. ఈ ఘటనలో మృత్యువాత పడ్డ వారి కుటుంబాలకు, గాయపడిన వారిని క్లబ్ ఆదుకుంటుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. లైసెన్స్ వివాదం ఈ క్లబ్‌కు సరైన డాక్యుమెంటేషన్ లేదని, లైసెన్స్ ఎలా మంజూరు చేశారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. 25 మంది మృతికి కారణమైన ఈ ప్రమాదం తర్వాత, అక్రమంగా నడుస్తున్న క్లబ్‌లు, నిబంధనలు పాటించినవి, లైసెన్స్‌లు లేని వాటిపై కఠిన చర్యలకు గోవా ప్రభుత్వం సిద్ధమవుతోంది. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని గోవా ప్రభుత్వం బాధితుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చింది. ఈ ఘటన గోవాలోని పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు దారి తీసింది.