ఓవైపు క్లబ్ మంటల్లో చిక్కుకుంటే థాయ్‌లాండ్‌కి టికెట్ బుక్ చేసుకున్న ఓనర్స్
ఇంకా థాయ్‌లాండ్‌లోనే ఉన్న ఇద్ధరు అన్నదమ్ములు బుధవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. థాయ్‌లాండ్ నుంచి తాము ఢిల్లీకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రాగానే తమను కస్టడీలోకి తీసుకోకుండా 4 వారాల సమయం కావాలని పిటిషన్ దాఖలు చేశారు.
గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో ఎక్కువ మంది క్లబ్‌లో పని చేసే వారే. కొందరు మాత్రమే టూరిస్టులు ఉన్నారు. బయటపడటానికి సరైన దారి లేకపోవడం వల్ల చాలామంది మంటల్లో చిక్కుకుపోయారు. కొందరు మంటల వల్ల వచ్చిన పొగను పీల్చి చనిపోయారు. డిసెంబర్ 6న అర్ధరాత్రి జరిగిన ఈ దారుణం ప్రపంచాన్ని షేక్ చేసింది.
అసలు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్లబ్ నిర్వాహకులను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే.. ఈ క్లబ్ ఓనర్స్ మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయిన ఓనర్స్ ఇప్పటి వరకు క్లబ్ ప్రమాదంపై పోలీసులను కూడా సంప్రదించలేదు. దీంతో వాళ్లపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
పోలీసుల విచారణలో తేలిందేంటంటే.. క్లబ్ ఓనర్స్ ఇద్దరు అన్నదమ్ములు సౌరభ్, గౌరవ్, థాయ్‌లాండ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరూ డిసెంబర్ 7న తెల్లవారుజామున థాయ్‌లాండ్ పారిపోయినట్లు ఆధారాలు సేకరించారు.
ఓవైపు మంటలు క్లబ్‌ని చుట్టుముడితే వీళ్లు మాత్రం ఏమీ తెలియనట్టు థాయ్‌లాండ్‌కి టికెట్లు బుక్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మంటలు ప్రారంభం కాగానే అర్ధరాత్రి 1.17 నిమిషాలకు మేక్‌మైట్రిప్ ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసి ఢిల్లీ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కి ఇండిగో ఫ్లైట్ ఎక్కి తప్పించుకొని పారిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు ఇంకా థాయ్‌లాండ్‌లోనే ఉన్న ఇద్ధరు అన్నదమ్ములు బుధవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. థాయ్‌లాండ్ నుంచి తాము ఢిల్లీకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రాగానే తమను కస్టడీలోకి తీసుకోకుండా 4 వారాల సమయం కావాలని పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




