Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపే.. భారత్‌లో కనిపిస్తుందా..?
Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం గ్రహణం ఉదయం వేళ కొనసాగనున్నప్పటికీ.. దేశంలో ఎక్కడి నుంచీ ఇది కనిపించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఖగోళ ఔత్సాహికులు ఇతర దేశాల్లోని దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారాలు, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించేందుకు అవకాశం ఉన్నది.
Lunar Eclipse | ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం గ్రహణం ఉదయం వేళ కొనసాగనున్నప్పటికీ.. దేశంలో ఎక్కడి నుంచీ ఇది కనిపించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఖగోళ ఔత్సాహికులు ఇతర దేశాల్లోని దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారాలు, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించేందుకు అవకాశం ఉన్నది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.53 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం మధ్యాహ్నం 12.51 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9.43 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకోనుంది. ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణ దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. ఈ గ్రహణం పాక్షిక చంద్రగ్రహణంగా ఏర్పడనుంది. భూమి నీడ చంద్రుడిపై పడే సమయంలో దాని ఉపరితలంలో దాదాపు 96 శాతం మేర నీడలోకి వెళ్లనుంది. మిగిలిన సుమారు 4 శాతం ప్రాంతం సూర్యకాంతిని అందుకుంటుంది. దీంతో చంద్రుడు పూర్తిగా కనుమరుగుకాకుండా ముదురు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ దీన్నే సాధారణంగా ‘బ్లడ్ మూన్’గా పిలుస్తారు. భారత్‌లో గ్రహణాన్ని నేరుగా వీక్షించే అవకాశం లేకపోవడంతో ఇక్కడి ప్రజలకు ఇది ఆకాశంలో సాధారణ పౌర్ణమి చంద్రుడిలాగే కనిపించనుంది.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






