Mojtaba Khamenei | అమెరికా దాడిలో కాలు కోల్పోయి.. కోమాలో ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ..?
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ప్రస్తుతం కోమాలో (Mojtaba Khamenei in coma) ఉన్నట్లు బ్రిటిష్ పత్రిక ది సన్ నివేదిస్తోంది. ఇజ్రాయెల్-యూఎస్ జరిపిన సంయుక్త దాడిలో అతను తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.
International | Published On Mar 13, 2026, 10.04 am IST
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డాడని అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. అయితే, ఈ వార్తలను ఇరాన్ అధికారులు ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ క్షేమంగా ఉన్నారని, ఆయన ఇరాన్ ప్రత్యేక ఉగ్రవాద వ్యతిరేకదళం ఎన్ఓపీవో రక్షణలో ఉన్నారని పేర్కొంటున్నారు. అయితే, ఆయన గురించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం కోమాలో (Mojtaba Khamenei in coma) ఉన్నట్లు బ్రిటిష్ పత్రిక ది సన్ నివేదిస్తోంది. ఇజ్రాయెల్-యూఎస్ జరిపిన సంయుక్త దాడిలో అతను తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. ఈ దాడిలో మొజ్తాబా ఖమేనీ ఓ కాలు కూడా కోల్పోయినట్లు సదరు పత్రిక నివేదిస్తోంది (Mojtaba Khamenei lost a leg). ప్రస్తుతం టెహ్రాన్‌లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు, దాడుల్లో ఆయన కాలేయం కూడా దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ సదరు పత్రిక నివేదిస్తోంది.
"ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఇక ఇదే దాడిలో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారు. టెహ్రాన్‌లోని సినా యూనివర్శిటీ ఆసుపత్రిలో ఖమేనీకి గట్టి భద్రత నడుమ చికిత్స అందిస్తున్నారు. అతను చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఓ కాలు కూడా పోయింది. లివర్ దెబ్బతిన్నది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు" అని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ది సన్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి మొజ్తాబా ఖమేనీ ఎలాంటి నాయకత్వం వహించడం లేదని తెలిపింది.
సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ
అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నియామకాన్ని ఇరాన్ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' అధికారికంగా ప్రకటించింది. తదుపరి సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వచ్చి నాలుగు రోజులు అవుతున్నా.. ఆయన ఎక్కడా బయట కనిపించకపోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన తన మద్దతుదారుల ముందుకు రాకపోవడం, ఎలాంటి సందేశం విడుదల చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఆయన కార్యాలయం కూడా మొజ్తాబాకు సంబంధించి ఎలాంటి వివరాలనూ పంచుకోవడం లేదు. ప్రభుత్వ మీడియా మాత్రం ఆయన పాత ఫుటేజీలను ఉపయోగిస్తూ ఆయన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
జాన్‌బాజ్ ఆఫ్ రమదాన్
ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో బహుశా ఆయన గాయపడి ఉండొచ్చంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా కొత్త సుప్రీం లీడర్‌ను "జాన్‌బాజ్ ఆఫ్ రమదాన్" అంటూ పేర్కొంటోంది. అంటే రమదాన్ యుద్ధంలో గాయపడిన వీరుడు అని అర్థం. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్న తర్వాత ఎవరైనా సరే దేశ ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని విడుదల చేస్తుంటారు. లేదంటే రాతపూర్వకంగా అయినా ప్రకటన చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. దీంతో మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? అంటూ ఇరాన్‌లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వార్తల వేళ ది సన్ పత్రిక నవేదిక కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
Also Read..
అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. ఇరాక్‌లో కుప్పకూలిన సైనిక విమానం
వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mojtaba Khamenei | తీవ్ర గాయాలయ్యాయన్న వదంతుల వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వీడియో రిలీజ్
ఆగస్టు 9, 2026

Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్
జులై 14, 2026

Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..
జులై 13, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



