త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IndiGo Flight | 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు.. ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

IndiGo Flight | పాట్నా నుంచి ల‌క్నో వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) పెను ప్ర‌మాదం త‌ప్పింది. 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు (Lightning) తాకడంతో విమానం ముందుభాగంలోని రాడోమ్ (Radome) దెబ్బతింది.

G

National | Published On Oct 8, 2026, 7.26 am IST

IndiGo Flight | 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు.. ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
Advertisement

IndiGo Flight | త్రినేత్ర న్యూస్‌: పాట్నా నుంచి ల‌క్నో వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) పెను ప్ర‌మాదం త‌ప్పింది. 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు (Lightning) తాకడంతో విమానం ముందుభాగంలోని రాడోమ్ (Radome) దెబ్బతింది. ఇక‌ ల్యాండింగ్ అవుతుండ‌గా వడగళ్ల వాన కూడా ఎదురైంది. అయితే పైల‌ట్లు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో విమానం సుర‌క్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్లు పరిస్థితిని అదుపులో ఉంచి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

104 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన ఇండిగో విమానం బీహార్‌లోని పాట్నా (Patna) నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నో (Lucknow) వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా విమానం ముందుభాగాన్ని పిడుగు తాకింది. దీంతో రాడోమ్‌ దెబ్బతింది. భారీ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డామ‌ని అనుకుంటుండ‌గానే.. ల్యాండింగ్‌ సమయంలో వడగళ్ల వాన కూడా ఎదురైంది. అయితే పైలట్లు పరిస్థితిని అదుపులో ఉంచి విమానాన్ని చౌధరీ చరణ్‌సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించ‌డంతో అంతా సురక్షితంగా బయటప‌డ్డారు. కాగా, విమానం షెడ్యూల్‌ సమయం కంటే 8 నిమిషాల ముందుగానే ల్యాండ్‌ కావడం గమనార్హం.

ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) దర్యాప్తు ప్రారంభించింది. అనుమతులు పొందిన తర్వాత విమానం తిరిగి సేవల్లోకి వస్తుందని పేర్కొంది. నియంత్రణ సంస్థ అనుమతి లభించిన తర్వాతే ఈ విమానాన్ని తిరిగి సర్వీసులకు అనుమతిస్తారు.

`పాట్నా నుంచి లక్నోకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానం 6E 625 ల్యాండింగ్ సమయంలో వడగండ్ల వానతో కూడిన ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. దీనివల్ల విమానం ముందు భాగంలోని రాడోమ్ దెబ్బతిన్న‌ది. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది, ప్రయాణికులందరూ తమ గమ్యస్థానమైన లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పపై సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాం. ఈ విమానానికి అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత, అవసరమైన అనుమతులు పొంది తిరిగి సర్వీసులను పునరుద్ధరిస్తాం` అని ఇండిగో విమాన ప్ర‌తినిధి తెలిపారు.

కాగా, ఇటీవల కూడా ఇండిగో విమానానికి ఇలాంటి ఘటన ఎదురైంది. గత నెల గువాహటి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో టెయిల్‌ స్ట్రైక్‌కు గురైంది. బలమైన గాలులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ఇండిగో తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement