LIC HFL | ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
LIC HFL | లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL)లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసినవారు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
LIC HFL | త్రినేత్ర.న్యూస్: లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL)లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసినవారు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 180 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. తెలంగాణలో 24, ఆంధ్రప్రదేశ్‌లో 8 చొప్పున ఉండగా, అత్యధికంగా కర్ణాటకలో 29 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి సిటీ కేటగిరీని బట్టి ప్రతి నెల రూ.41,509 (City Category I), రూ.39,909 (City Category II), రూ.38,709 (City Category III) వేతనం వస్తుంది.
మొత్తం పోస్టులు- 180
- తెలంగాణలో 24 (హైదరాబాద్‌లో 19, హనుమకొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేటలో 1 చొప్పున) పోస్టులు ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో 8 (విజయవాడ, వైజాగ్‌లో 3 చొప్పున, గుంటూరు, తిరుపతిలో 1 చొప్పున)
అర్హతలు
- 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 2026, ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రాతపరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30
అప్లికేషన్ ఫీజు: రూ.800 + జీఎస్టీ 18 శాతం
రాతపరీక్ష: జూన్ మొదటివారంలో
వెబ్‌సైట్: https://www.lichousing.com
వివరాలకు..
తాజావార్తలు
- ●Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
- ●Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
- ●Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..
- ●Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి
- ●Chabahar Port | భారత్‌కు షాక్.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
- ●Deepika Padukone | లగ్జరీలకే లక్షల్లో ఖర్చులు - కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్ తప్పుకోవడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు

Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..

Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి



