ఆదివారం తెల్లవారుజామున గోవాలోని అర్పోరాలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. అగ్నికి ఆహుతైన నైట్‌క్లబ్ దృశ్యాలు చూస్తే భయానకంగా ఉన్నాయి. మృతులందరినీ గుర్తించామని అధికారులు తెలిపారు. మృతుల్లో 20 మంది క్లబ్ సిబ్బంది ఉండగా, ఐదుగురు టూరిస్టులు ఉన్నారని వెల్లడించారు. పేలుడు వల్ల మంటలు ప్రారంభమై క్షణాల్లో క్లబ్ మొత్తం చుట్టుముట్టాయి. లోపల ఉన్నవారు బయటపడేందుకు కూడా సమయం దొరకలేదని అధికారులు తెలిపారు. పొగ వల్ల ఊపిరాడక పోవడం వల్లనే ఈ క్లబ్ అర్పోరా నది బ్యాక్ వాటర్స్ సమీపంలో ఉంటుంది. దీన్ని ఐలాండ్ క్లబ్ అని కూడా పిలుస్తారు. ఈ క్లబ్ కు వెళ్లే రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. అందుకే సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఫైర్ ఇంజిన్లు క్లబ్ వరకు చేరుకోలేకపోయాయి. క్లబ్‌కి కనీసం 400 మీటర్ల దూరంలోనే ఫైర్ ఇంజిన్లు ఆగిపోయాయి. దీని వల్ల మంటలు ఆర్పడం లేట్ అయింది. దీంతో ప్రమాద తీవ్రత ఇంకాస్త పెరిగింది. అలాగే మంటల వల్ల వ్యాపించిన పొగ వల్లనే చాలామంది ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు స్పష్టం చేశారు. సీఎం పర్యవేక్షణ గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గోవాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ప్రాథమికంగా చేసిన విచారణ ప్రకారం మంటలు పై అంతస్థులో ప్రారంభం అయ్యాయన్నారు. బయటికి వచ్చే ఎగ్జిట్ రూట్లు ఇరుకుగా ఉండటం వల్లనే తప్పించుకోవడం కష్టమైందన్నారు. మంటలు ఉద్ధృతం కావడం వల్ల అండర్ గ్రౌండ్ వైపు వెళ్లిన వారంతా అక్కడ వెంటిలేషన్ లేక పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయారని సీఎం వివరించారు. నిబంధనల ఉల్లంఘన నైట్‌క్లబ్‌కు అధికారులు సీల్ వేశారు. క్లబ్ నిర్వాహకులు, యజమానులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. క్లబ్ ఏమాత్రం అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించలేదని అధికారులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత అక్కడ అంతా బూడిద మాత్రమే మిగిలింది. నైట్ క్లబ్ మంటల్లో పూర్తిగా కాలిపోయిన తర్వాత అక్కడ మిగిలిన అవశేషాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #WATCH | Goa | Latest visuals from the spot where a fire broke out at Birch restaurant in North Goa’s Arpora, claiming the lives of 25 people. pic.twitter.com/7lLxaNHpwS — ANI (@ANI) December 8, 2025