త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Misir Besra | మావోయిస్టు పొలిట్‌బ్యూరోలో చివరి క్రియాశీల‌క నేత అరెస్ట్‌..

Misir Besra | మావోయిస్టు (Maoist) పొలిట్‌బ్యూరోలో మిగిలి ఉన్న ఏకైక అగ్ర‌నేత‌, మోస్ట్ వాంటెడ్ నాయ‌కుల‌లో ఒక‌రైన మిసిర్ బెస్రా (Misir Besra)ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అరెస్టు చేశాయి.

G

National | Published On Jul 29, 2026, 10.14 am IST

Misir Besra | మావోయిస్టు పొలిట్‌బ్యూరోలో చివరి క్రియాశీల‌క నేత అరెస్ట్‌..
Advertisement

Misir Besra | త్రినేత్ర‌.న్యూస్‌: మావోయిస్టు (Maoist) పొలిట్‌బ్యూరోలో మిగిలి ఉన్న ఏకైక అగ్ర‌నేత‌, మోస్ట్ వాంటెడ్ నాయ‌కుల‌లో ఒక‌రైన మిసిర్ బెస్రా (Misir Besra)ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అరెస్టు చేశాయి. జార్ఖండ్‌లోని (Jharkhand) ధ‌న్‌బాద్-గిరిడీ జిల్లాల స‌రిహ‌ద్దుల్లోని తుండి-మండియా అట‌వీ ప్రాంతంలో స్థానిక పోలీసుల‌తో క‌లిసి సీఆర్పీఎఫ్ (CRPF) జ‌వాన్లు సంయుక్తంగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో బెస్రాను ప‌ట్టుకున్నారు. ఆయ‌న‌తోపాటు అనుచ‌రులైన‌ గౌర‌వ్ హాస్దా, మోచూతోపాటు మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. బెస్రాపై రూ.కోటి రివార్డు ఉన్న‌ట్లు తెలిపారు. తూర్పు భార‌త‌దేశంలో రెడ్ కారిడార్ (Red Corridor) వెంబ‌డి మావోయిస్టు కార్య‌క‌లాపాల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంతోపాటు భ‌ద్ర‌తా దాళాల‌పై దాడులు, ఆయుధాల ర‌వాణాలో ప్ర‌ధాన పాత్ర పోషించార‌ని వెల్ల‌డించారు. అడవి నుంచి తప్పించుకునేందుకు ప్ర‌యత్నిస్తుండగా పట్టుకున్నామ‌ని చెప్పారు.

పొలిట్ బ్యూరోలో సీనియ‌ర్ స‌భ్యుడు (Politburo Member), టాప్ క‌మాండ‌ర్ అయిన‌ బెస్రాను 2007లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే రెండేండ్ల త‌ర్వాత 2009లో క‌స్ట‌డీ నుంచి త‌ప్పించుకున్నారు. అప్ప‌టినుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బెస్రా ఇప్పుడు పట్టుబడ్డారు. అయితే ఇప్ప‌టికే మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుల్లో కొంద‌రు ఎన్‌కౌంట‌ర్ల‌లో చ‌నిపోగా, మ‌రికొంద‌రు లొంగిపోయారు. తాజాగా బెస్రాను కూడా అరెస్టు చేయ‌డంతో మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోలో క్రియాశీల‌కంగా ఉన్నవారు ఎవ‌రూ లేకుండా పోయారు. ఆయ‌న‌పై వివిధ రాష్ట్రాల్లో 154కుపైగా క్రిమిన‌ల్ కేసులు న్నాయి. మావోయిస్టు దాడుల‌కు సూత్ర‌దారిగా ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. విచార‌ణలో మావోయిస్టు నెట్‌వ‌ర్క్‌కు చెందిన కీల‌క స‌మాచారం ల‌భించ‌వ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement