Rock Check Dam | పాకిస్థాన్‌కు గట్టి షాక్.. సింధు నదిపై భారత్ తొలి రాక్ చెక్ డ్యామ్
Rock Check Dam | దాయాది పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. లడఖ్ (Ladakh)లో నీటి కొరతను అధిగమించడంతో పాటు సింధు నది జలాలను (Indus Waters Treaty) సమర్థంగా వినియోగించుకునే చర్యల్లో భాగంగా ఉప్సీ ప్రాంతంలో సింధు నదిపై ఓ చెక్‌డ్యామ్‌ను (Rock Check Dam) నిర్మించింది. ఎలాంటి సిమెంటును ఉపయోగించకుండా కేవలం సహజ సిద్ధమైన బండరాళ్లతో దీన్ని నిర్మించారు. ఈ రాక్ చెక్‌డ్యామ్ వల్ల నీటి మట్టం సుమారు 10 అడుగుల మేర పెరిగింది.
Rock Check Dam | త్రినేత్ర.న్యూస్ : లడఖ్ (Ladakh)లో నీటి కొరతను అధిగమించడంతో పాటు సింధు నది జలాలను (Indus Waters Treaty) సమర్థంగా వినియోగించుకునే దిశగా కీలక ముందడుగు పడింది. లడఖ్ (Ladakh) యంత్రాంగం ఉప్సీ ప్రాంతంలో సింధు నదిపై ఓ చెక్‌డ్యామ్‌ను (Rock Check Dam) నిర్మించింది. సాంప్రదాయ కాంక్రీట్ డ్యామ్‌లలా కాకుండా దీన్ని కేవలం రాళ్లతోనే నిర్మించారు. ఎలాంటి సిమెంటును ఉపయోగించకుండా కేవలం సహజ సిద్ధమైన బండరాళ్లతో నిర్మించిన మొట్టమొదటి చెక్ డ్యామ్ ఇదే కావడం విశేషం. ఈ రాక్ చెక్‌డ్యామ్ వల్ల నీటి మట్టం సుమారు 10 అడుగుల మేర పెరిగింది. తద్వారా ఇగూ ఫే సాగునీటి కాలువ ద్వారా స్థానిక వ్యవసాయ భూములకు సాగునీటిని అందించనున్నారు.
సుమారు 4 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో ఈ డ్యామ్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంత రైతులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. సింధు నది అత్యంత లోతులో ప్రవహిస్తుండటంతో నీటిని పంపుల ద్వారా పొలాలకు తీసుకెళ్లడం రైతులకు సాధ్యమయ్యేది కాదు. దీంతో విత్తనాలు వేసే సమయంలో వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. నీటి కొరత కారణంగా సాగు చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ రాక్ డ్యామ్‌తో స్థానిక రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలగనుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యత
ఈ ప్రాజెక్టుకు వ్యవసాయ ప్రయోజనాలతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యత కూడా ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లడఖ్ ప్రాంతం గుండా ప్రవహిస్తూ పాకిస్థాన్‌కు వెళ్తున్న సింధు నది జలాలను సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు వినియోగించుకునే మౌలిక వసతులపై భారత్ దృష్టి పెట్టింది. నీటి నిల్వ, సాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే లడఖ్ ప్రాంతంలో నీటి నిల్వలను పెంచే దిశగా అక్కడి యంత్రాంగం సింధు నదిపై మరిన్ని చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది.
లడఖ్‌లో 36 చెక్‌డ్యామ్‌లు..
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపిన ప్రతిపాదనల ప్రకారం.. లడఖ్ వ్యాప్తంగా దాదాపు 36 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి యంత్రాంగం ఆమోదం కోరింది. వీటిలో లేహ్‌లో ఏడు చెక్‌డ్యామ్‌లు కాగా, కార్గిల్‌లో 29 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.56 కోట్లుగా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతుండగా.. మరిన్ని ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవి పూర్తయితే లడఖ్‌లో నీటి భద్రతను పెంచడంతో పాటు సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచే అవకాశం ఉంది.
Also Read..
రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
ఎవరికైనా తల్లే తొలి గురువు: సైబరాబాద్ సీపీ రమేష్
భారత్ జీడీపీ 7.8%.. కేంద్రం లెక్కల్లో ₹6.05 లక్షల కోట్ల మిస్టరీ!
సంబంధిత వార్తలు

Indus Waters Treaty | సింధు జలాల ఒప్పందం: హేగ్ కోర్టు తీర్పును తోసిపుచ్చిన భారత్.. మా నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదని ఫైర్
ఆగస్టు 31, 2026

Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ
ఆగస్టు 2, 2026

Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●Cyberabad CP Ramesh | ఎవరికైనా తల్లే తొలి గురువు: సైబరాబాద్ సీపీ రమేష్
- ●కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!
- ●Bhagyashri Borse | రష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ - హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే
- ●Harish Rao Dubbaka Speech | కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది.. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి
- ●IPO | ఈ వారంలో 11 ఐపీవోలు.. రూ.7వేల కోట్లకు ఇష్యూలు..
- ●Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి

Cyberabad CP Ramesh | ఎవరికైనా తల్లే తొలి గురువు: సైబరాబాద్ సీపీ రమేష్

కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!

Bhagyashri Borse | రష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మలయాళం మూవీ - హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే

Harish Rao Dubbaka Speech | కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది.. రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి



