Terrorists Killed | ఎల్‌ఓసీ దాటే యత్నం.. ల్యాండ్‌మైన్ పేలి నలుగురు ఉగ్రవాదులు హతం!
Terrorists Killed | నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులు ల్యాండ్‌మైన్ పేలుడులో మరణించినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో కృష్ణఘాటి సెక్టార్‌లోని నంగి టక్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
- మృతుల్లో లష్కరే తోయిబా కీలక కమాండర్ ఫైజాన్?
- జమ్మూకశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఘటన..
Terrorists Killed | నియంత్రణ రేఖ (LoC) వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులు ల్యాండ్‌మైన్ పేలుడులో మరణించినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో కృష్ణఘాటి సెక్టార్‌లోని నంగి టక్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కీలక కమాండర్ మహమ్మద్ ఫైజాన్ కూడా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎల్‌ఓసీ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తుండగా ల్యాండ్‌మైన్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురూ మరణించారు. మృతులను మహమ్మద్ ఫైజాన్, మహమ్మద్ ఇస్తియాక్, మహమ్మద్ వకాస్, మహమ్మద్ ఆసిమ్‌గా గుర్తించినట్లు సమాచారం. వీరిలో ఫైజాన్ లష్కరే తోయిబాకు చెందిన కీలక కమాండర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరణించిన నలుగురు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీఓజేకే) పరిధిలోని పూంఛ్ జిల్లాలోని హజీరా తహసీల్ పరిధిలో ఉన్న మండాలా, మదర్‌పూర్ ప్రాంతానికి చెందినవారిగా ప్రాథమిక సమాచారం పేర్కొంటోంది. పేలుడు, ఉగ్రవాదుల మృతి ఘటనకు సంబంధించిన అధికార వర్గాలు స్పందించాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. చొరబాటు యత్నాలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపుపై వివరాలు వెల్లడించాల్సి ఉన్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao Father in Law | హరీష్‌రావు మామకు హైకోర్టులో ఊరట: బలవంతంగా ఖాళీ చేయించొద్దు
- ●Bhagyashri Borse | అల్ట్రా మోడ్రన్ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే
- ●Retail Inflation | కూరగాయల మంట.. ద్రవ్యోల్బణం బాదుడు!
- ●Ranabaali vs Jailer 2 | రజనీకాంత్ వర్సెస్ విజయ్ దేవరకొండ - మూడోసారి బాక్సాఫీస్ క్లాష్
- ●No relief for PepsiCo | పెప్సీకోకు హైకోర్టులో దక్కని ఊరట.. కొత్త ఉత్పత్తులపై ఆంక్షలు యథాతథం
- ●Vijayawada EV Car Fire Accident | డివైడర్‌ను ఢీకొట్టి మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ కారు దగ్ధం.. చిన్నారితో సహా నలుగురు సజీవదహనం

Harish Rao Father in Law | హరీష్‌రావు మామకు హైకోర్టులో ఊరట: బలవంతంగా ఖాళీ చేయించొద్దు

Bhagyashri Borse | అల్ట్రా మోడ్రన్ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే

Retail Inflation | కూరగాయల మంట.. ద్రవ్యోల్బణం బాదుడు!

Ranabaali vs Jailer 2 | రజనీకాంత్ వర్సెస్ విజయ్ దేవరకొండ - మూడోసారి బాక్సాఫీస్ క్లాష్




