Tollywood | ఇండియన్ సినిమా హిస్టరీలోనే లెంగ్తీ టైటిల్ ఇదే – ఆ నలుగురు డైరెక్టర్ కొత్త ప్రయోగం
ఇండియన్ సినిమా హిస్టరీలోనే లెంగ్తీ టైటిల్‌తో ఆ నలుగురు డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ ఓ సినిమా చేయబోతున్నాడు. మ్యూజిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Entertainment | Published On Sep 5, 2026, 3.55 pm IST
Tollywood | రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ నలుగురు సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు చంద్రసిద్ధార్థ్. మానవ సంబంధాలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందన్నది మనసులను కదిలించేలా ఈ సినిమాలో చూపించాడు. రాజేంద్రప్రసాద్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా ఆ నలుగురు నిలిచింది. ఆ నలుగురు అనంతరం మధుమాసం, ఇది సంగతీ, అందరి బంధువయతో పాటు దర్శకుడిగా మరికొన్ని సినిమాలు చేశాడు చంద్రసిద్ధార్థ్.
లెంగ్తీ టైటిల్‌తో...
పరాజయాల కారణంగా ఎనిమిదేళ్ల పాటు సినిమాలకు దూరమైన చంద్రసిద్ధార్థ్ మళ్లీ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ లెంగ్తీ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. "ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు" అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రాబోతుంది. హర్ష హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మ్యూజికల్ థ్రిల్లర్...
మ్యూజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకొని వెరైటీ కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, పశ్చాత్తాపం వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగనుంది. దర్శకత్వం వహిస్తూనే స్వయంగా చంద్రసిద్ధార్థ్ ఈ సినిమాను నిర్మించారు.
రేడియో స్టేషన్ మిస్టరీ...
‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది. నా మిత్రుడు, డైరెక్టర్ మదన్ తో ఈ కథను సినిమా గా తీద్దామనుకున్నాము. కానీ మదన్ చనిపోవడంతో ఆలస్యమైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ వుంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ వుంటారు. ఆ స్టేషన్ వెనకున్న మిస్టరీ ఏమిటి? పాట కోరిన శ్రోతలు ఎవరన్నదే ఈ మూవీ కథ" అని చంద్ర సిద్ధార్థ్ అన్నారు.
ఈ సినిమాకు జే రెక్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులోని నాలుగు పాటలను చంద్రసిద్ధార్థ్ రాయడం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | ఎపిక్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో మెరిసిన రష్మిక – మరిది సినిమా ఈవెంట్‌కు గెస్ట్‌గా వదిన
సెప్టెంబర్ 5, 2026

Vaishnavi Chaitanya | నీ పేరు ఎవరికి తెలియదని అవమానించారు – వైష్ణవి చైతన్య ఎమోషనల్ కామెంట్స్
సెప్టెంబర్ 5, 2026

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Wealth Building | భారీ జీతం లేకపోయినా సంపద పెంచుకోవచ్చు.. ఈ 5 అలవాట్లు ఉంటే చాలు..
- ●Jhiram Ghati Case | ఝీరం ఘాటి ఊచకోత కేసు.. పది మందిని దోషులగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు..!
- ●BC Caste Census | బీసీ కులగణనపై కాంగ్రెస్ 100 రోజుల ఉద్యమం
- ●Harish Rao Siddipet Speech | ఆరు గ్యారంటీలతో మోసం.. అసెంబ్లీలో గల్లా పట్టుకుని అడుగుతా
- ●Rock Check Dam | పాకిస్థాన్‌కు గట్టి షాక్.. సింధు నదిపై భారత్ తొలి రాక్ చెక్ డ్యామ్
- ●Cyberabad CP Ramesh | ఎవరికైనా తల్లే తొలి గురువు: సైబరాబాద్ సీపీ రమేష్

Wealth Building | భారీ జీతం లేకపోయినా సంపద పెంచుకోవచ్చు.. ఈ 5 అలవాట్లు ఉంటే చాలు..

Jhiram Ghati Case | ఝీరం ఘాటి ఊచకోత కేసు.. పది మందిని దోషులగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు..!

BC Caste Census | బీసీ కులగణనపై కాంగ్రెస్ 100 రోజుల ఉద్యమం

Harish Rao Siddipet Speech | ఆరు గ్యారంటీలతో మోసం.. అసెంబ్లీలో గల్లా పట్టుకుని అడుగుతా



