త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cabinet Decisions | 92 GWh విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు

Cabinet Decisions | దేశంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు 92 గిగావాట్ అవర్ల గ్రిడ్ స్థాయి ఎనర్జీ స్టోరేజ్ (92 GWh additional battery energy storage) పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

D

National | Published On Nov 4, 2026, 4.45 pm IST

Cabinet Decisions | 92 GWh విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు
Advertisement

Cabinet Decisions | త్రినేత్ర న్యూస్ : దేశంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు 92 గిగావాట్ అవర్ల గ్రిడ్ స్థాయి ఎనర్జీ స్టోరేజ్ (92 GWh additional battery energy storage) పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ గ్రిడ్-స్థాయి విద్యుత్ నిల్వ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 14,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) కు ప్ర‌ధాని మోదీ (PM Modi) అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఈ 92 గిగావాట్ అవర్ల సామర్థ్యాన్ని 60 GWh పంప్డ్ స్టోరేజ్, 30 GWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, 2 GWh సరికొత్త, అభివృద్ధి చెందుతున్న ఇంధన నిల్వ సాంకేతికతలు (Emerging Technologies)గా వ‌ర్గీక‌రించారు. కేబినెట్ సమావేశ వివరాలను (Cabinet Decisions) కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో నాన్-ఫాజిల్ ఫ్యూయల్స్ వాటా 52 శాతానికి చేరిందని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే రాత్రి వేళల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం వల్ల ట్రాన్స్‌మిషన్ లైన్లు పూర్తిస్థాయిలో వినియోగం కావడం లేదని చెప్పారు.

విద్యుత్ నిల్వ వ్యవస్థల వల్ల మన వద్ద ఉన్న పవర్ ట్రాన్స్‌మిషన్ సామర్థ్యాన్ని పెంచుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఒక సోలార్ పవర్ ప్లాంట్ కోసం 10 మెగావాట్ల ఖాళీ ట్రాన్స్‌మిషన్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తే.. రాత్రి వేళల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి కాకపోవడం వ‌ల్ల ఆ లైన్లు వృథాగా ఉంటున్నాయని ఉద‌హ‌రించారు. అందుకే నిల్వ వ్య‌వ‌స్థ‌లు లేక‌పోతే కేవలం పగటిపూట అవసరాల కోసమే అదనపు ట్రాన్స్‌మిషన్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుందని వివ‌రించారు. అదే విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తితో పాటు అందుబాటులో ఉన్న 10 మెగావాట్ల లైన్ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో 24 గంటలూ వినియోగించుకోవచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

అదేవిధంగా.. లైంగిక దాడి, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను వేగంగా పరిష్కరించడానికి 850 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల (FTSC) కొనసాగింపు, బలోపేతానికి కేంద్ర కేబినెట్ ప‌చ్చ‌జెండా ఊపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 399 ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టులతో సహా మొత్తం 779 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తుండగా.. వీటి సంఖ్యను 850కి పెంచే ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

అత్యాచారాల కేసులు, పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులను త్వరితగతిన విచారించి మహిళలు, చిన్నారులకు వేగంగా న్యాయం అందించడం ఈ ప‌థకం ముఖ్య ఉద్దేశం. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని అమ‌లు చేయ‌డానికి మొత్తం రూ.3,788.04 కోట్ల నిధుల‌ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,353.15 కోట్లు కాగా (నిర్భయ నిధి నుంచి సమకూరుస్తారు), రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వాటా రూ.1,434.89 కోట్లుగా ఉంది.

Also Read..

తెలంగాణ‌లో రెండురోజులు భారీ వ‌ర్షాలు.. కొత్త‌గూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్‌

అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల ఎఫెక్ట్‌.. భార‌త స్టాక్ మార్కెట్ల‌కు మ‌హ‌ర్ద‌శ‌..?

కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్‌ ఘన విజయం

Advertisement
Advertisement