Jaggareddy | తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిచి తీరుతాం.. రాహుల్‌ను ప్రధానిని చేస్తాం
Jaggareddy | తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిచి తీరుతాం.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి తీరుతామని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఛాలెంజ్‌గా తీసుకుంటామన్నారు.
Jaggareddy | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిచి తీరుతాం.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి తీరుతామని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఛాలెంజ్‌గా తీసుకుంటామన్నారు. బుధవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ ఇంట్లోనే ప్రధాని పదవి పుట్టింది. ఆయన ప్రధాని కావాలనుకుంటే 2004లోనే అయ్యేవారు. రాముడి పేరు చెప్పుకుని మూడుసార్లు ప్రధాని అయిన మోదీ.. ఆయన అడుగుజాడల్లో పని చేయడం లేదు. స్వాతంత్య్ర ఉద్యమంలోనే మహాత్మాగాంధీ.. రఘుపతి రాఘవ రాజారాం అని రాముడి భజన చేశారు. అప్పటికీ బీజేపీ పుట్టలేదు.. మోదీ, అమిత్ షాలు కూడా పుట్టి ఉండరు అని జగ్గారెడ్డి తెలిపారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని అమిత్ షా మాట్లాడారు. అమిత్ షా ఒక విషయం మర్చిపోతున్నారు. అమిత్ షా మీరు అధికారంలోకి రాకముందు ఏం జరిగిందో మీ కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకోండి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలు నేరుగా నెహ్రుని ప్రధానిగా ఎన్నుకున్నారు అని గుర్తు చేశారు.
2004లో సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. సోనియా, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని ఎంపీలు అందరు తీర్మానం చేశారు. కానీ మాకు ప్రధాన మంత్రి పదవి వద్దన్నారు. మన్మోహన్ సింగ్‌ని ప్రైమ్ మినిస్టర్ చేశారు. మన్మోహన్ సింగ్ సైతం ప్రైమ్ మిస్టర్ అయ్యాక రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మీరు ప్రధానమంత్రి కావాలని కోరారు. కానీ రాహుల్ గాంధీ తిరస్కరించి మీరే ఉండాలి.. మీ నేతృత్వం లోనే పని చేస్తామని అన్నారని జగ్గారెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- ●Serilingampally Gurukulam Land Row | శేరిలింగంపల్లిలో రూ.1000 కోట్ల గురుకుల భూమి కబ్జా.. చేసిందెవరు?
- ●Satyavathi Rathod | వ్యవసాయ వర్సిటీలో వీసీ ఆగడాలు: బాధితురాలికే బదిలీ శిక్షా?
- ●Union Cabinet Decisions | క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లకు బిగ్ బూస్ట్: 3 కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
- ●ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్.. మళ్లీ నంబర్‌వన్ బౌలర్‌గా స్టార్క్
- ●HP OmniBook 5 | ఓఎల్ఈడీ డిస్ప్లేలతో హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్‌లు అదిరాయి.. ధర తక్కువ, ఫీచర్లు అధికం..
- ●Farmer Mela | కొడంగల్‌లో నవంబర్ 7 నుంచి 9 వరకు మెగా రైతు మేళా

Serilingampally Gurukulam Land Row | శేరిలింగంపల్లిలో రూ.1000 కోట్ల గురుకుల భూమి కబ్జా.. చేసిందెవరు?

Satyavathi Rathod | వ్యవసాయ వర్సిటీలో వీసీ ఆగడాలు: బాధితురాలికే బదిలీ శిక్షా?

Union Cabinet Decisions | క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లకు బిగ్ బూస్ట్: 3 కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్.. మళ్లీ నంబర్‌వన్ బౌలర్‌గా స్టార్క్





