Kerala | బ్రెయిన్ డెడ్.. చనిపోతూ ఐదుగురి ప్రాణాలు నిలిపిన 10 నెలల చిన్నారి
Kerala | కేరళ (Kerala) రాష్ట్రంలో విషాద ఘటన వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆ పసికందు చనిపోతూ మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టింది (10 month old Alin saves five lives).
Kerala | కేరళ (Kerala) రాష్ట్రంలో విషాద ఘటన వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆ పసికందు చనిపోతూ మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టింది (10 month old Alin saves five lives). అవసరమైన వారికి అవయవాలు దానం చేసి రాష్ట్రంలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా నిలిచింది.
పతనంతిట్ట (Pathanamthitta) జిల్లా మల్లపల్లికి చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ దంపతులు తమ పది నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహం, మరో ఇద్దరితో కలిసి ఈనెల 5న కారులో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరోకారు వీరి వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ చిన్నారికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
బ్రెయిన్ డెడ్
కుటుంబ సభ్యులు చిన్నారిని తొలుత చంగనస్సేరి, తిరువల్ల ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఫిబ్రవరి 7న కొచ్చిలోని అమృత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న పాపకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ చిన్నారి బతికే అవకాశం లేదని చెప్పడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. చిన్నారి బతకదని తెలిసి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ మరొకరి రూపంలో ఈ ప్రపంచాన్ని చూడాలని ఆశపడ్డారు. చిన్నారి అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు.
అతి పిన్న వయస్కురాలైన అవయవ దాత
దీంతో వారి అంగీకారంతో వైద్యులు చిన్నారి నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, గుండె వాల్వ్, కళ్లు సేకరించారు. వాటిని అవసరమైన వారికి అమర్చారు. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న ఓ 10 ఏళ్ల బాలుడికి ఆలిన్ రెండు కిడ్నీలను అమర్చనున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 6 నెలల పసికందుకి కాలేయాన్ని దానం చేశారు. ఆస్టర్ మెడ్‌సిటీలో చికిత్స పొందుతున్న మరో చిన్నారికి గుండె వాల్వ్ అందించారు. అమృత ఆసుపత్రిలోని అంధులైన చిన్నారులకు చూపునిచ్చేందుకు కళ్లను దానం చేశారు. ఇలా ఆ చిన్నారి చనిపోతూ ఐదుగురి ప్రాణాలను నిలబెట్టింది. దీంతో రాష్ట్రంలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా నిలిచింది (Keralas youngest organ donor).
వీణా జార్జ్ భావోద్వేగం
ఈ ఘటనపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ భావోద్వేగానికి గురయ్యారు. ఊహించని నష్టాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మరికొందరి ప్రాణాలు కాపాడిందని పేర్కొన్నారు. పుట్టెడు దుఃఖంలోనూ వారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






