Heavy Rain | దేశవ్యాప్తంగా ముంచెత్తిన భారీ వర్షాలు.. నీట మునిగిన ఢిల్లీ.. కశ్మీర్, కేరళ అతలాకుతలం
Heavy Rain | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు (landslides) విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. పలు చోట్ల చెట్లు నేలకూలుతున్నాయి.
Heavy Rain | త్రినేత్ర.న్యూస్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆయా రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్ష బీభత్సానికి చెట్లు నేలకూలుతున్నాయి. రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రాత్రంతా భారీ వర్షం కురిసింది (Delhi waterlogged). ఈ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేవలం 24 గంటల్లో మయూర్ విహార్‌లో అత్యధికంగా 102 మి.మీ వర్షపాతం నమోదైంది. పూసాలో 83 మి.మీ, లోధి రోడ్‌లో 80 మి.మీ, సఫ్దర్‌జంగ్‌లో 72.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సదర్ బజార్, నసీర్‌పూర్, గ్రేటర్ కైలాష్, బదర్‌పూర్, తేలివారా, మహావీర్ బజార్, స్వరూప్ నగర్, కుశక్ రోడ్ సహా తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలబడింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాజధాని ప్రాంతానికి భారత వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ముంబైలో భారీ వర్షాలు.. రైలు సర్వీసులకు అంతరాయం
మహారాష్ట్రను గత కొంతకాలంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు ఆర్థిక రాజధాని ముంబై సహా సమీప ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే, భోర్ ఘాట్ సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పుణె మార్గంలో కూడా రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.
సూరత్‌ను ముంచెత్తిన వరదలు.. తొమ్మిది మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు సూరత్ నగరం నీట మునిగింది. ఈ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వేలాది మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
కశ్మీర్, కేరళలను వణికించిన కొండచరియలు, ఆకస్మిక వరదలు
కశ్మీర్, కేరళ రాష్ట్రాలను కొండచరియలు, ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షానికి కేరళలోని వయనాడ్ జిల్లాలో ఒక టన్నెల్ ప్రాజెక్ట్ వద్ద మట్టి దిబ్బ కుప్పకూలిపోవడంతో ఐదుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే, వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు, జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాలోని భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో అధికారులు అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
రాజస్థాన్‌లో..
రాజస్థాన్‌లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోటా జిల్లాలోని రాంగంజ్ మండిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read..
భారీ వర్షం.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. షాకింగ్ వీడియో
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ఆరో రాష్ట్రంగా ఉత్తరాఖండ్
బెడిసికొట్టిన ట్రాయ్ వ్యూహం.. 140, 1600 సిరీస్ నంబర్ల బ్లాకింగ్ కంటిన్యూ..
తాజావార్తలు
- ●Deepika Padukone | దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక చోప్రా బెటర్ - వారణాసి లుక్‌పై నెటిజన్ల కంపేరిజన్స్
- ●CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ●Etela Rajender vs Bandi Sanjay | బండి, ఈటల మధ్య సయోధ్య..! ఇకనైనా కలిసి పని చేసేనా..?
- ●Food Safety Telangana | తెలంగాణలో ఫుడ్ అడల్టరేషన్పై ఉక్కుపాదం: కల్తీ చేస్తే ఇక క్రిమినల్ కేసులే.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ●Minister Srihari | నిరుద్యోగుల గురించి కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు : మంత్రి వాకిటి శ్రీహరి
- ●Abhishek Banerjee | టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీస్ కూల్చివేత

Deepika Padukone | దీపికా పడుకోణ్ కంటే ప్రియాంక చోప్రా బెటర్ - వారణాసి లుక్‌పై నెటిజన్ల కంపేరిజన్స్

CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

Etela Rajender vs Bandi Sanjay | బండి, ఈటల మధ్య సయోధ్య..! ఇకనైనా కలిసి పని చేసేనా..?

Food Safety Telangana | తెలంగాణలో ఫుడ్ అడల్టరేషన్పై ఉక్కుపాదం: కల్తీ చేస్తే ఇక క్రిమినల్ కేసులే.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!






