Sabarimala Ayyappa Temple | రేపు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు..!
Sabarimala Ayyappa Temple | కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారా ఆదివారం తెరుచుకోనున్నాయి. మిథునం మాసం నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Devotional | Published On Jun 13, 2026, 7.08 pm IST
Sabarimala Ayyappa Temple | కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారా ఆదివారం తెరుచుకోనున్నాయి. మిథునం మాసం నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో మేళ్ శాంతి ఈడీ ప్రసాద్ సాయంత్రం 5 గంటలకు ఆలయ గర్భగుడిని తెరిచి, సంప్రదాయ దీపాన్ని వెలిగించనున్నారు. అనంతరం నెలవారీ పూజల ప్రారంభ కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగనున్నాయి. ఈ నెలవారీ ఉత్సవాల సమయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, నిత్య ఆరాధనలు, దీపారాధన సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గణపతి హోమం, ఉషఃపూజ, ఉదయాస్తమయ పూజలు, సాయంత్రం దీపారాధన వంటి సేవలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ సమయంలో భక్తులు సైతం అయ్యప్పను దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. భక్తుల కోసం ఆన్‌లైన్ వర్చువల్ క్యూ సౌకర్యం అందుబాటులో ఉండనున్నది. ఇందుకోసం అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ www.sabarimalaonline.org పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 19 వరకు నెలవారీ ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. ఈ నెల 19న రాత్రి పూజల అనంతరం భక్తులకు వీడ్కోలు పలికి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. అప్పటివరకు ప్రత్యేక దర్శనాలు, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. మిథునం మాస పూజల సందర్భంగా శబరిమల పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూల నిర్వహణ, భద్రతా చర్యలు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి





