Akhil Joyan | మరో రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే రష్యా దాడిలో కేరళ నావికుడు మృతి
Akhil Joyan | మూడు నెలల క్రితం నిశ్చితార్థమైంది.. మరో రెండు నెలల్లోనే పెళ్లి.. ఇక తనకు కాబోయే వధువుతో సంసార జీవితంపై ఎన్నెన్నో కలలు కన్నాడు.. ఊహల ప్రపంచంలో తేలియాడాడు.. భవిష్యత్‌పై ఎన్నో ఆశలు మూటగట్టుకున్నాడు. కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయి. అతని కుటుంబానికి జ్ఞాపకాలే మిగిలాయి.
Akhil Joyan | త్రినేత్ర.న్యూస్ : మూడు నెలల క్రితం నిశ్చితార్థమైంది.. మరో రెండు నెలల్లోనే పెళ్లి.. ఇక తనకు కాబోయే వధువుతో సంసార జీవితంపై ఎన్నెన్నో కలలు కన్నాడు.. ఊహల ప్రపంచంలో తేలియాడాడు.. భవిష్యత్‌పై ఎన్నో ఆశలు మూటగట్టుకున్నాడు. కానీ ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయి. అతని కుటుంబానికి జ్ఞాపకాలే మిగిలాయి. ఇదంతా ఉక్రెయిన్ కార్గో షిప్‌పై రష్యా చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కేరళ నావికుడు అఖిల్ జోయాన్( Akhil Joyan ) కథ ఇదీ.
అఖిల్ జోయాన్ కేరళ( Kerala )లోని కాసర్‌ఘడ్ జిల్లాకు చెందిన యువకుడు. ప్రస్తుతం అతని వయసు 26 ఏళ్లు. తన 19వ ఏటలోనే నావికుడిగా ఉద్యోగం సంపాదించాడు. మధ్య తరగతి కుటుంబం కావడంతో అఖిల్ చిన్న వయసులోనే బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. కష్టపడి ఇటీవలనే ఓ ఇల్లు నిర్మించుకున్నాడు.
నెల రోజుల క్రితమే ఉక్రెయిన్‌కు
ఇక మూడు నెలల క్రితం అలప్పుజాకు చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది అఖిల్‌కు. నెల రోజుల క్రితమే ఉక్రెయిన్‌కు వెళ్లాడు. మరో రెండు నెలల్లో తిరిగివచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వివాహానికి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి.
సీన్ కట్ చేస్తే.. జూలై 19న ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి మొక్కజొన్నను తరలిస్తున్న కార్గోషిప్‌పై రష్యా దాడి చేసింది. ఆ నౌకకు నావికుడిగా కొనసాగుతున్న అఖిల్ జోయన్.. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
శోకసంద్రంలో తల్లిదండ్రులు
ఇక అఖిలో జోయాన్ రష్యా దాడిలో చనిపోయినట్టు సోమవారం రాత్రి అధికారికంగా అతని కుటుంబ సభ్యులకు ఉక్రెయిన్ నుంచి ఈమెయిల్ అందింది. అఖిల్ మృతి వార్త విన్న తల్లిదండ్రులు, కాబోయే వధువు షాక్‌కు గురయ్యారు. తమకున్న ఒకే ఒక్క కుమారుడు ప్రాణాలు కోల్పోవడం తమ కుటుంబంలో కోలుకోలేని విషయమని వారు బోరున విలపించారు. మరో రెండు నెలల్లో పెళ్లికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు.
సంబంధిత వార్తలు

Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం
అక్టోబర్ 4, 2026

Sabarimala prasadam | శబరిమల ప్రసాదంలో హలాల్ బెల్లం వినియోగం.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్టోబర్ 1, 2026

Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణన చేయకుంటే ఢిల్లీని దిగ్బంధిస్తాం
- ●Mamitha Baiju | "ప్రేమలు" హీరోయిన్‌కు జాక్‌పాట్ - నాని సినిమాతో రేట్ పెంచేసిన మమితా బైజు!
- ●Rakesh Reddy | ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి
- ●Pink Victory Run Hyderabad | పింక్ విక్టరీ రన్ 10వ వార్షికోత్సవం: మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. చిన్నజీయర్ స్వామిజీ, వైద్య నిపుణుల పిలుపు
- ●Food Delivery | ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని.. డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

V Srinivas Goud | ఓబీసీ కుల గణన చేయకుంటే ఢిల్లీని దిగ్బంధిస్తాం

Mamitha Baiju | "ప్రేమలు" హీరోయిన్‌కు జాక్‌పాట్ - నాని సినిమాతో రేట్ పెంచేసిన మమితా బైజు!

Rakesh Reddy | ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి

Pink Victory Run Hyderabad | పింక్ విక్టరీ రన్ 10వ వార్షికోత్సవం: మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. చిన్నజీయర్ స్వామిజీ, వైద్య నిపుణుల పిలుపు



