త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keralam | కేర‌ళ పేరు మార్పు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

Keralam | ద‌క్షిణాది రాష్ట్రం కేర‌ళ (Kerala) పేరును కేర‌ళంగా మారుస్తూ తీసుకొచ్చిన చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు లోక్‌స‌భ (Lok Sabha) ఆమోదం తెలిపింది. విప‌క్ష ఎంపీల నినాదాలు, ఆందోళ‌న‌ల మ‌ధ్యే ఈ బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. ఎలాంటి చ‌ర్చా లేకుండానే ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం ల‌భించించింది.

D

National | Published On Aug 11, 2026, 3.56 pm IST

Keralam | కేర‌ళ పేరు మార్పు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం
Advertisement

Keralam | ద‌క్షిణాది రాష్ట్రం కేర‌ళ (Kerala) పేరును కేర‌ళంగా (Keralam) మారుస్తూ తీసుకొచ్చిన చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు లోక్‌స‌భ (Lok Sabha) ఆమోదం తెలిపింది. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసుల చ‌ర్య‌ల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌భ‌కు వ‌చ్చి స‌మాధానం ఇవ్వాలంటూ విప‌క్ష స‌భ్యులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. విప‌క్ష ఎంపీల నినాదాలు, ఆందోళ‌న‌ల మ‌ధ్యే ఈ బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఎలాంటి చ‌ర్చా లేకుండానే ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం ల‌భించించింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును తదుపరి ప్రక్రియ కోసం రాజ్యసభకు పంపించనున్నారు. అక్క‌డ కూడా బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రపతి సంతకంతో అధికారికంగా పేరు మార్పు అమల్లోకి వస్తుంది. దీంతోపాటు నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చట్టసవరణ బిల్లుకు కూడా సభ ఆమోదం లభించింది. ఆ త‌ర్వాత లోక్‌స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది.

‘మలయాళంలో రాష్ట్రం పేరును ‘కేరళం’ అని పిలిచేవారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటం కాలం నుంచి మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ బలంగా ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌ లో రాష్ట్రం పేరును కేరళ అని రాసి ఉంది. దీంతో దాన్ని కేర‌ళంగా మార్చాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త కొంత‌కాలంగా డిమాండ్ చేస్తోంది. కేర‌ళ‌ను కేర‌ళంగా (Kerala To Be Renamed Keralam) మార్చే ప్ర‌తిపాద‌న‌కు రాష్ట్ర అసెంబ్లీ ఇప్ప‌టికే రెండుసార్లు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.

కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ప్ర‌కారం కేర‌ళ రాష్ట్రం పేరును కేర‌ళం (Keralam)గా మార్చాల‌ని కోరుతూ కేంద్రానికి విజ్ఞ‌ప్తి పంపింది. అయితే, ఆ తీర్మానంపై కేంద్రం కొన్ని సాంకేతిక‌ప‌ర‌మైన అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. దీంతో 2024 జూన్‌లో మ‌రోసారి రాష్ట్ర పేరును కేర‌ళంగా మార్చే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌తిప‌క్షాల‌తో పాటు అంద‌రూ ఏక‌ప‌క్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. 8వ షెడ్యూల్‌లోని భాషలు సహా అన్ని భాషల్లోనూ ‘కేరళం’గా పేరు మార్చడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వం గ‌త‌కొన్ని రోజులుగా కేంద్రాన్ని కోరుతూ వ‌స్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం.. కేరళ పేరును ‘కేరళం’గా (Keralam) మార్చే ప్రతిపాదనకు కేంద్ర‌ కేబినెట్ ఇటీవ‌లే ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.

Also Read..

మిస్సింగ్‌ కేసుల్లో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ‌

రాహుల్.. తెలంగాణ‌కు రండి, పారిపోకుండా పార్ల‌మెంటుకూ రండి.. మీకున్న నాలెడ్జ్‌తోనే మాట్లాడండి

ఆగస్టు 12న సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Advertisement
Advertisement